ఇంస్టా కోసం రీల్స్ చేసే పిచ్చిలో ఆరుగురు అమ్మాయిలు యమునా నదిలో కొట్టుకుపోయారు. అందరూ చనిపోయారు. ఉమ్మడి కుటుంబానికి చెందిన వీరందరూ అక్కచెల్లెళ్ళే .. ఆగ్రాకు దగ్గరలోని నాగ్లా సమామి గ్రామంలో ఈ దారుణం జరిగింది. వీళ్ళ ఇంటికి అరకిలోమీటరు దూరంలోనే యమునా నది ఉంది. సెలవులు కావడంతో అక్కాచెల్లెళ్లు , నదిలో రీల్స్ చేద్దామని బయలు దేరిపోయారు. వీరికి ముందే అదే కుటుంబంలోని నలుగురు యమునానదిలో స్నానం చేసొచ్చారు.
రెండో బ్యాచ్ గా, ఈ ఆరుగురు బాలికలు పోయారు. రీల్స్ చేస్తూ ఒక బాలిక నదిలోకి జారిపోయింది. ఆ అమ్మాయిని కాపాడేందుకు మరో అమ్మాయి చేయి అందించింది. అలా ఒకరినొకరు కాపాడే ప్రయత్నంలో ఆరుగురూ నదిలో కొట్టుకుపోయారు. వీళ్ళు రీల్స్ చేస్తున్న ప్రాంతంలో నది లోతుగా ఉంటుంది. ప్రవాహం కూడా ఎక్కువగానే ఉంటుంది. మృతిచెందిన వారిలో మస్కన్ అనే యువతికి వారం క్రితమే వివాహ నిశ్చితార్ధం అయింది. ఇందుకోసం వీళ్లంతా సంబరాల్లో ఉండి , రీల్స్ తీసుకుందామని వచ్చారు.

