22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

ఎర్రపెదాల గబ్బిలం చేప విచిత్ర జీవి

భూమ్మీదనే 30 శాతం జీవులను మనం చూడలేదు. దట్టమైన అడవుల్లో, గుహల్లో లక్షలయేళ్ళుగా అవి జీవనం సాగిస్తున్నాయి. ఇప్పటికీ మనం చూడలేని, మనకు తెలియని వృక్షజాతులు కూడా ఉన్నాయి. భూమ్మీదనే ఇలాఉంటే , సముద్రగర్భంలోని జలచరాలు సంగతి చెప్పవవసరమే లేదు. సముద్రగర్భంలో ఇప్పటికీ 40 శాతం జీవులను మనం చూడలేదు. అరుదైన జీవులకు సముద్రం ఆలవాలం.

అలాంటివాటిలో ఇదిగో, ఈ ఎర్రపెదాల గబ్బిలం చేప ఒకటి. సముద్రగర్భంలోనే ఉండే ఈ విచిత్ర జీవి నీటిపైకి రాదు. ఎందుకంటే అది ఈదలేదు. దానికి రెక్కలు ఉన్నప్పటికీ , ఈ రెక్కలతో ఈదలేదు. ఆ రెక్కలని కాళ్ళుగా చేసుకొని సముద్రం అడుగుభాగంలో నడుస్తుంది. దానిపెదాలు లిప్ స్టిక్ వేసుకున్నట్టుగా ఉంటాయి. చేప ఆకారం కూడా గబ్బిలాన్ని పోలిఉంటుంది.

ఈ చేప జీవిత కాలం 12 సంవత్సరాలు. దీనిని ఆహారంగా తీసుకున్న సందర్భాలు లేవు. గాలాపగోస్ దీవులలో ఈక్వెడార్ పరిదిలో సముద్రంలో 76 మీటర్ల లోతులో లేదా సముద్రం అడుగుభాగంలో ఈ చేపలు ఉంటాయి. కోస్టారికాలోని పసిఫిక్ తీరంలో కోకోస్ ద్వీపం సమీపంలో కనిపించే ఈ చేపలు చనిపోతే తప్ప ఒడ్డుకు రావు. ఈ చేపలు 40 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. ఆడ చేప గుడ్లు పెట్టిన అవి జిగురుగా ఉండి , కింద రాళ్లకు, నాచుకి అతుక్కుని ఉంటాయి. తరువాత మగచేప వాటిని పొదిగేవరకు కాపాడుతుంది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.