గ్రహణాల సమయంలో ఆలయాలను మూసివేస్తారు అన్న సంగతి అందరికీ తెలిసిందే . గర్భవతులను కూడా బయట తిరగొద్దని చెబుతారు. అయితే కొన్ని శైవ క్షేత్రాలను మాత్రం గ్రహణాలకు సంబంధం లేకుండా తెరిచి ఉంచుతారు . గ్రహాలకు అధిపతి అయిన శివాలయాల్లో ఉండదని ఒక విశ్వాసం . అయితే సాధారణంగా గ్రహణ సమయాల్లో ఆలయాలు మూసివేసే ముందు మూలవిరాట్ విగ్రహం పాదాల ముందు కానీ, విగ్రహం తల మీద కానీ తులసి దళాలు పెట్టడం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం . ఈ తులసీ దళాలు గ్రహణ ప్రభావాల నుండి విగ్రహాన్ని కాపాడతాయని భావిస్తారు . అన్నిటికంటే సృష్టి అద్భుతమైనది. సృష్టి రహస్యం అనంతమైనది .
ఆ సృష్టికర్త ప్రభావమే ఈ గ్రహణ ప్రభావాలన్నది ఒక విశ్వాసం. అందుకనే సృష్టిలో ఒక భాగమైన గ్రహణ సమయాలలో వెలువడే అణుధార్మిక తరంగాల వ్యతిరేక ప్రభావాలనుంచి విగ్రహాల నుంచి వెలువడే అతీంద్రియ కిరణాలను కాపాడే ప్రయత్నంలో ఇలా చేస్తారు. దేవాలయాల మూసివేతకు కూడా మరో కారణం చెబుతారు . వివిధ రకాల రాశులు వివిధ రకాల జాతకులు అర్చకులతో సహా భక్తులు భగవంతుని సందర్శిస్తుంటారు . ఆ సమయంలో గ్రహణ ప్రభావం భక్తుల మీద ఉంటుంది. భక్తుల మానసిక పరిస్థితిని కూడా అది ప్రభావితం చేస్తుంది.
అందువల్ల గ్రహణ ప్రభావం కారణంగా విడుదలయ్యే వ్యతిరేక లేదా నెగిటివ్ ఎనర్జీ దేవాలయ ప్రాంగణంలో ఉండకూడదని ఆలయం తలుపులు మూసేస్తారు. శాస్త్ర పరంగాను సాంకేతిక పరంగా గ్రహణ సమయంలో ధార్మిక కిరణాలు వెలువడుతాయి . ఇలాంటి ధార్మిక కిరణాలు మనుషులపై పడటం కూడా మంచిది కాదు . అందుకనే గర్భవతులు గ్రహణసమయాల్లో బయటకు రాకూడదని చెబుతారు. అలాగే ఆలయాల్లోని మూలవిరాట్ నుంచి లేదా ఆ క్షేత్ర మహత్యం నుంచి విలువడే ఆధ్యాత్మిక తరంగాలను , గ్రహణ సమయంలో వెలువడే కిరణాలు ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. అందువల్లని ఆలయాల మూసివేసి గ్రహణ సమయం తర్వాత ఆలయాలను శుద్ధిచేసి శాస్త్రోక్తంగా ఆలయాలను మళ్లీ తెరుస్తారు .
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

