మోడల్ రంగ సుధాపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు కలకలం రేపాయి. ఇందులో కొన్ని వీడియోలు కూడా ఉన్నాయట. ఈ మేరకు రంగ సుధా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాధాకృష్ణ అనే వ్యక్తి, మరియు కొన్ని ట్విట్టర్ పేజీలు తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్న మోడల్ రంగ సుధా గతంలో రాధాకృష్ణతో రిలేషన్ లో ఉండింది.

ఆ సమయంలో ఇద్దరూ తీసుకున్న ప్రయివేట్ వీడియోలు , [ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయట. తాము కలసి ఉన్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు బయట పెడతానని గతంలోనే రాధాకృష్ణ తనను బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్న సుధా , ఇద్దరూ ఎంతకాలం రిలేషన్ లో ఉన్నారో కూడా చెప్పింది. దీంతో కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు, ఇలాంటి వీడియోలు ఎవరు షేర్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

