22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

మూడు రోజులు రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు.

నైరుతీ రుతుపవనాల ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతం కావడంతో పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదిక తెలిపింది.31 వ తేదీన శనివారం రోజున నెల్లూరు,కర్నూలు, అనకాపల్లి, కాకినాడ,కోనసీమ, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల,అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని నివేదిక తెలియజేసింది. గుంటూరు,బాపట్ల,వైఎస్ఆర్ కడప, అనంతపురం, కృష్ణా,ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదిక తెలియజేసింది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.