అందరికి శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట.. ఇది పాతకాలంనాటి సామెత . నేటి ఎన్నికల రాజకీయాలలో రాజకీయ వ్యూహకర్తగా , రాజకీయ ఫలితాల జోస్యాలు చెప్పగలరని పేరున్న ప్రశాంత్ కిషోర్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. రాజకీయ నాయకులకు అందరికి శకునాలు చెప్పి, అందరికీ రాజకీయ జోస్యాలు చెప్పి కోట్లు గడించిన ప్రశాంత్ కిషోర్ ,తన విషయంలోకి వచ్చేటప్పటికి ఘోర అపజయాలను మూట కట్టుకున్నాడు . తను గెలిచే సంగతి ఎలా ఉన్నా ఎవరిని కూడా గెలిపించుకోలేక అసలు డిపాజిట్లు కూడా కోల్పోయి, బీహార్ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసి చరిత్రలో లేకుండానే పోయాడు.
ఒక్క సీటులో కూడా గెలవలేక పోగా డిపాజిట్లు కూడా కోల్పోయింది
ప్రశాంత్ కిషోర్ జన స్వరాజ్ పేరుతో ఒక పార్టీ పెట్టాడు . ఈ పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 239 స్థానాల్లో పోటీ చేసింది . అయితే ఈ 239 స్థానాల్లో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ జన స్వరాజ్ పార్టీ ఒక్క సీటులో కూడా గెలవలేక పోగా డిపాజిట్లు కూడా కోల్పోయింది. రెండు శాతం ఓటు మాత్రమే ఆ పార్టీకి వచ్చింది.కొన్ని పార్టీలకు సర్వేలు చేయించి ఎవరు గెలుస్తాడో చెప్పించి ,ఎలా గెలవాలో వ్యూహాలు చెప్పి ,కహానీలు చేసి, టక్కు టమార విద్యలతో వందల కోట్ల రూపాయలు ఫీజులుగా తీసుకొని, తన మనుషులను క్షేత్రస్థాయిలో పెట్టి ప్రతి నియోజకవర్గానికి వారిని పర్యవేక్షకులుగా చేసి, ఇలా రకరకాల జిమ్మిక్కులు చేయడంలో ప్రశాంత్ కిషోర్ ఉద్దండుడు.
వ్యూహకర్తలు చేసే ట్రిక్కులు, జిమ్మిక్కులు పనిచేయవని తేలిపోయింది
అయితే బీహార్ ఎన్నికలు ఒక నిజాన్ని స్పష్టం చేశాయి . ప్రజాభిప్రాయం ఒక విధంగా ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు చేసే ట్రిక్కులు, జిమ్మిక్కులు పనిచేయవని , తేలిపోయింది.కాకపోతే ఇలాంటి వారంతా ఇతర సర్వే సంస్థ లాగానే జనం నాడిని పట్టుకుని చెప్పగల వ్యక్తులే తప్ప జన అభిప్రాయాన్ని, జనాలు రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలను ఎవరూ మార్చలేరని స్పష్టంగా ఈ ఎన్నికల్లో తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ఓటమి, టిడిపి గెలుపు విషయాలు కూడా అదే ధోరణిలో ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో పోటీకి ముందు మూడు వేల కిలోమీటర్లు కూడా పాదయాత్ర కూడా చేశారు . ఆ పాదయాత్రలోనే పార్టీ విధానాలు ,సర్వే సంస్థలను బట్టి ప్రజాభిప్రాయాలు, ఇవన్నీ కూడా సేకరించారు . వాటినే మేనిఫెస్టో గా రూపొందించారు. అయితే అవేవీ పనికిరావని తేలిపోయింది.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

