22.5 C
New York
Saturday, April 4, 2026

Latest Posts

విమాన ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమా ?

విమానంలో పవర్ లేదు.. ఇంజిన్ థ్రస్ట్ కూడా లేదు.. నో పవర్‌ , నో పవర్‌..నో థ్రస్ట్‌..గోయింగ్‌ డౌన్‌.. మేడే మేడే.. ఇవీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో ప్రమాదానికి గురైన విమానం పాలెట్ చెప్పిన చివరి మాటలు.. ఎటిసిలో ఈ మాటలు రికార్డ్ అయ్యాయి. దీన్నిబట్టి ఇంజిన్ వైఫల్యం, పవర్ లేకపోవడం వల్లనే ఈ ఘోర ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

మనదేశంలో విమానాల చెకింగ్ అద్వాన్నంగా ఉంటుందని సర్వత్రా విమర్శలు ఉన్నాయి. ఒక విమానం వచ్చి నిలిస్తే దానిని మనదేశంలో అయితే కేవలం టెక్నీషియన్లే నామమాత్రంగా చెక్ చేసి పంపుతారని చెబుతారు. ఫ్లయిట్ ఇంజనీర్లు ఆ దాపులకు రాకుండా టెక్నీషన్లను పంపుతారంటారు. అదే విదేశాల్లో అయితే విమానాన్ని నాలుగుదశల్లో సీనియర్ ఇంజనీర్లు చెక్ చేస్తారు.

ప్రమాదానికి గురైన విమానం అహ్మదాబాద్ కి వచ్చినప్పుడే , విమానంలో కరెంట్ లేదని, ఏసీలు , ఇతర ఎలెక్ట్రానిక్ పరికరాలు పనిచేయలేదని ఓ ప్రయాణీకుడు ఆన్ లైన్లో వీడియో పెట్టాడు. దాని తరువాతనే విమానం బయలుదేరిందని భావిస్తున్నారు. విదేశాలకు సుదీర్ఘ ప్రయాణం చేసే ఈ విమానం చెకింగ్ లో పొరపాట్లు కారణంగానే ఇంత ఘోరం జరిగి ఉంటుందా ..? అన్న అనుమానాలు ఉన్నాయి..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.