సినిమా వేరు, నిజజీవితం వేరు, వైసిపి అధికారంలో ఉండగా తిట్లు, శాపనార్ధాలతో సంచలన రాజకీయ దుమారం రేపిన పోసాని మురళి , పోలీసు కస్టడీలో కామెడీ చేయబోయి చివరకు అసలు విషయం చెప్పేశాడట. దాదాపు తొమ్మిది గంటలసేపు పోలీసులు పోసానిని ప్రశ్నించారు. ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనం వహించాడట.. కొంత సమయం తరువాత పోసాని గతంలో పవన్ కళ్యాణ్ ని , ఆయన భార్య బిడ్డలను, చంద్రబాబుని , ఆయన కొడుకు లోకేష్ తో సహా కుటుంబ సభ్యులను నీచంగా తిట్టిన వీడియోలు ఆయన ముందు ప్లే చేశారు.
ఒక్కో వీడియో క్లిప్ చూసిన తరువాత లవ్ యు రాజా అనే తన పాత సినిమా డైలాగ్ ని అనేవాడట. ఇలా చాలాసేపు ఏది అడిగినా , ఏది చూపించిన లవ్ యు రాజా అంటూ సైలెంట్ కామెడీ చేసేవాడు. చివరకు అవన్నీ తనమాటలేనని , అనకూడనివి, తిట్టకూడనివి కూడా తిట్టానని పోలీసుల ముందు ఒప్పుకొని , బాస్ ఆర్డర్స్ ప్రకారమే ఇలా మాట్లాడానని చెప్పేసాడు. నేరుగా బాస్ కాకుండా , మిడిల్ బాస్ ఫోన్ చేసి చెప్పేవాడని కూడా చెప్పాడని తెలిసింది..

