22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

పోసాని డ్రామా అస్వస్థత అబద్దమే -సిఐ వివరణ

సోషల్ మీడియాలో అసభ్య విమర్శలకు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న పోసాని భలే డ్రామా ఆడాడు. అయితే అది వికటించి అంటా బూతామని తేలడంతో పోసానిని ,హాస్పిటల్ నుంచి జైలుకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. తనకు గుండె నొప్పిగా ఉందని పోసాని జైల్లో పడిపోయాడు. పోసానిని జైలు అధికారులు, పోలీస్ సాయంతో హాస్పిటల్ లో చికిత్స చేయించారు.

రాజంపేటలోనూ, కడప రిమ్స్ లోనూ పోసానిని పరీక్షించిన డాక్టర్లు , అన్ని టెస్టులు చేసి , అతడి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. దీనిపై రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు. పోసానికి అస్వస్థత ఒక డ్రామా అని .రాజంపేట ఆస్పత్రిలో, కడప రిమ్స్‌లో పోసానికి చికిత్స చేయించామని . పోసాని అడిగిన అన్ని టెస్టులు చేయించాం..పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు.. పోసాని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తేల్చారని చెప్పారు. పోసానిని రిమ్స్ నుంచి తిరిగి రాజంపేట సబ్‌జైలుకు తరలిస్తామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.