22.5 C
New York
Sunday, April 5, 2026

Latest Posts

కారులో కుక్కతో ఆట ప్రాణం తీసింది.

పెంపుడు కుక్కసరసం ఒక నిండు ప్రాణం తీసింది. మరో ఇద్దరినీ గాయపరిచింది. రెండు వాహనాలను ధ్వంసం చేసింది. చీరాల, ఒంగోలు రోడ్డులో ఒక కుటుంబం తమ పెంపుడు కుక్కను కారులో తీసుకోబోతూ ఓ ప్రమాదానికి కారణమైంది . ఒంగోలు చీరాల బైపాస్ రోడ్ లో కారు డ్రైవింగ్ లో ఉంది. వెనుక సీట్లో కుటుంబ సభ్యులు కుక్కతో ఆటలాడుతున్నారు. వారి సంతోషం కోసం కుక్కతో విన్యాసాలు చేయిస్తుండగా ఆ కుక్క ఉన్నపళంగా కార్ డ్రైవర్ పైకి దూకింది. దీంతో డ్రైవర్ భయపడిపోయి స్టీరింగ్ కంట్రోల్ తప్పింది స్టీరింగ్ కంట్రోల్ తప్పడంతో ఎదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్లను కారు ఢీకొంది .

ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి చనిపోయాడు. మరో ఇద్దరు గాయపడ్డాడు . చూశారా.? కారులో కుక్కతో ఆట ఎంత ప్రాణాంతకం అయిందో.? ఈ మారణహోమానికి కుటుంబం కారణమైంది. పెంపుడు కుక్కలను కారులో ఇలా తీసుకుపోతూ వాటితో చెలగాటం ఆడడం ,ముఖ్యంగా డ్రైవింగ్ సమయంలో ఇలాంటి పనులకు పాల్పడటం శోచనీయం..కొసమెరుపు ఏమిటంటే జీ ప్రమాదంలో గాయపడ్డ కుక్కను కూడా యజమానులు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. గాయపడ్డ వారిసంగతి, మరణించిన వ్యక్తి విషయం వదిలేసి.

ఇవి కూడా చదవండి.

ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

షర్మిల కొడుకు రాజకీయాల్లోకి ,మేనమామ జగన్ కి పోటీగా

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.