ఓ పైలట్ ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణం చేస్తూ తన పాస్పోర్ట్ మర్చిపోయి మళ్ళీ విమానాన్ని వెనక్కి తిప్పేశాడు. విమానయానంలో ఇది ఒక విచిత్రమైన సంఘటన. ఆ పైలెట్ మతిమరుపుతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాలిఫోర్నియా నుంచి చైనాలోని జియాంగ్ కి యునైటెడ్ ఎయిర్లైన్స్ బోయింగ్ విమానం ఈ నెల 22వ తేదీ బయలుదేరింది. ఉత్తర పసిఫిక్ సముద్రం మీదగా విమానం పోతుంది. దాదాపు ఒక గంట 45 నిమిషాల తర్వాత పైలట్ కి ఓక విషయం గుర్తొచ్చింది .

అదే ,తన పాస్పోర్ట్ మర్చిపోయిన అంశం. దీంతో పైలెట్ తన విమానాన్ని సాన్ ఫ్రాన్సిస్కోకు మళ్ళించాడు . విమానం వెనక్కి పోతుందని ,నన్ను క్షమించాలని దీనికి పరిహారంగా ప్రయాణికులకు ఒక్కొక్కరికి 15 డాలర్లు భోజనం ఖర్చులు కింద ఓచర్లు కూడా ఇస్తారని ప్రకటించారు. పైలెట్ దిగిన తర్వాత అమెరికన్ ఎయిర్లైన్స్ ఓ సమాచారం పంపించింది. మళ్ళీ కొత్త పైలెట్ ఎక్కి విమానాన్ని చైనాకు తీసుకుపోయాడు. చూశారుగా పైలెట్ మతిమరుపు ఎంత ఇబ్బంది పెట్టిందో ..? పైలెట్ పాస్ పోర్ట్ ,మరిచిపోవడం వాళ్ళ ఆకాశంలో విమానాన్ని వెనక్కి తిప్పి స్వదేశానికి తీసుకురావాల్సిన పరిస్థితి.

