మన దేశంలో విడాకులు సంఖ్య నానాటికి పెరుగుతుంది . సాంప్రదాయ సిద్ధమైన వివాహాలు వేదమంత్రాలు, విడాకులు సంఖ్య నానాటికి పెరుగుతున్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో మహారాష్ట్ర, ఆ తర్వాత స్థానంలో కర్ణాటక ,ఆ తర్వాత ఉత్తరప్రదేశ్,ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలు కూడా ఏడెనిమిది స్థానాల్లో ఉన్నాయి . మహారాష్ట్రలో ముంబై , పూనా లాంటి నగరాల్లో ,కర్ణాటకలో బెంగళూరు లాంటి నగరంలో , ఉత్తరప్రదేశ్లో లక్నో ,కాన్పూర్ లాంటి నగరాల్లో , ఎక్కువగా పెళ్లిళ్లు పెటాకులై విడాకులకు దారితీస్తున్నాయి.తెలంగాణలో హైదరాబాద్ ,ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ నగరాలలో ఎక్కువగా విడాకులు కేసులు నమోదవుతున్నాయి . గతంలో కంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా విడాకుల సంఖ్య పెరుగుతుంది . ప్రతినెల దాదాపు ఒకో రాష్ట్రంలో సగటున వెయ్యి విడాకులు కేసులు దాఖలు అవుతున్నాయి .
65 శాతం విడాకులు అమ్మాయిలనుంచే..
ఈ విడాకులు కేసుల్లో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే 65 శాతం విడాకులు అమ్మాయిలనుంచే వచ్చే ప్రతిపాదనలే. అబ్బాయిలు విడాకులు కోరే కేసులు 35 శాతం మాత్రమే. దీనికి కారణాలు సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషణ ,న్యాయవాదుల అభిప్రాయాలు ప్రకారం గత రెండున్నర దశాబ్దాలుగా మహిళలలో వచ్చిన ఆర్థిక స్వావలంబన , ఆర్థిక స్వాతంత్రం . స్వయంగా సంపాదించుకునే శక్తి కుటుంబాలకు అండగా ఉండే మనస్తత్వం, ఇవన్నీ కూడా వివాహ సంబంధాలలో ఇబ్బందులు కలగజేస్తున్నాయి.గత కొన్ని సంవత్సరాలుగా మహిళల కా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. మగవాళ్ళ కంటే ఎక్కువ జీతం తీసుకునే మహిళలు ఉన్నారు. చదువు మీద మహిళల్లో ఆసక్తి పెరిగింది. ఈ విషయంలో మగవారి కంటే మహిళలే ముందంజలో ఉన్నారు. విద్యా, ఉద్యోగ, మరియు ఆర్థిక స్వాతంత్య్రం, స్వావలంబన విషయాల్లో మహిళల్లో వచ్చిన ఈ మార్పు వారిని స్వతంత్ర వ్యక్తులుగా తీర్చిదిద్దింది.
భార్య అభిప్రాయాలను స్వేచ్ఛను భర్త భరించలేని పరిస్థితి..
ఇద్దరి అహంకారం, ఆభిజాత్యం కూడా ఒకరకంగా వీటికి కారణం అవుతుంది. ఆర్థికంగా సమృద్ధి సాధించి విద్యాపరంగా విజ్ఞాన పరంగా తనతో పోటీపడే భార్య అభిప్రాయాలను స్వేచ్ఛను భర్త భరించలేని పరిస్థితి వచ్చింది. అందువల్లనే ఇద్దరి మధ్య అహం పెరిగి అది విడాకులకు దారితీస్తుంది . సామాజికంగా మహిళలు ఉద్యోగాలతో సామాజిక సంబంధాలు పెరగడం , విస్తృత పరిచయాలు పరిచయాలు, ఆధునిక నాగరికతలు,వీటన్నింటిమీంచి మొబైల్ ఫోన్ కూడా బార్యాభర్తలమధ్య కలహాలకు, విడాకులకు ఒక భాగం కావడం విశేషం. అమ్మాయిలు మొబైల్ ఫోన్లలో ఎక్కువ కాలం గడపడం ఇష్టం లేని మగవాళ్ళు దీనిని వ్యతిరేకించడం, దాంతో గొడవలు పొడచూపడం జరుగుతొంది. ఒక విచిత్రం ఏంటంటే వివాహ సంబంధాల్లో విడాకులకు మొబైల్ ఫోన్ కూడా 25 శాతం కారణం. బార్యాభర్తలమధ్య వివాహ సంబంధాలు చెడిపోవడానికి కొన్ని కేసులలో మొబైల్ అడిక్షన్ ఒక కారణం. బార్యాభర్తలమధ్య అనుమానాలకూ ఇది ప్రదానం.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

