22.5 C
New York
Sunday, April 5, 2026

Latest Posts

పవన్ భార్య భక్తితో సమాధానం చెప్పిందా ?

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రతిపక్షాల విమర్శలు, విమర్శకుల మాటలకు ఆయన భార్య అన్నాలెజినోవా ఫుల్ స్టాప్ పెట్టింది. తన బిడ్డ మార్క్ శంకర్ ను అగ్ని ప్రమాదం నుంచి కాపాడినందుకు పవన్ కళ్యాణ్ భార్య తిరుమలకు పోయి, అక్కడ తలనీలాలు సమర్పించి తన భక్తిని చాటుకుంది. ఆ తరువాత డిక్లరేషన్ పై సంతకం చేసి స్వామి దర్శనం చేసుకుంది. ఇప్పుడు వార్తల్లో ప్రధాన అంశమైంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ ,మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తిరుమలలో ఇలాంటి డిక్లరేషన్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. మాజీ అయినా తరువాత డిక్లరేషన్ అడుగుతారని తెలిసిఆలయ ప్రవేశానికి రాలేదు . అలాగే జగన్మోహన్ రెడ్డి భార్య భారతి కూడా తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించలేదు. ఇక్కడే కాదు ఏ హిందూ దేవాలయాన్ని కూడా ఆమె సందర్శించలేదు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య విదేశీయురాలైనప్పటికీ , పుట్టుకతో క్రైస్తవ మతస్తురాలైనప్పటికీ ఆమె తిరుమల ఆలయం ప్రవేశం, అక్కడ తలనీలాల సమర్పణ ఒక రకంగా రాజకీయంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టింది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.. ఇటీవల కాలంగా సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఉద్యమానికి ఆయన భార్య క్రైస్తవ మతం రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రమైంది.

ప్రతిపక్షాలు కూడా విమర్శలు ఎక్కుపెట్టాయి . నీ భార్య మతం ఏంటి ..? సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతావా ..? అంటూ విమర్శకులు అస్త్రాలు ఎక్కుపెట్టారు.. అయితే అన్నలేజినోవా మాత్రం ఇప్పుడు సైలెంట్ గా వాటికి తన భక్తితో సమాధానం చెప్పింది. దీనికి రాజకీయాలతో సంబంధం లేకపోయినా ఆమె భక్తితోనే వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి తన బిడ్డను కాపాడినందుకు స్వామివారికి మొక్కుగా తలనీలాలు సమర్పించుకుంది. అలాగే ఆలయ లోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్ కూడా ఇచ్చింది. హిందూ ధర్మాన్ని తాను విశ్వసిస్తున్నానని , ఆ మతంపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇచ్చి విమర్శకుల నోళ్లు మూయించింది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.