తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియా మొదలైపోయింది. హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. 23వ తేదీన ప్రీమియర్ షోలకు కూడా ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాంతో పాటుగా హరిహర వీరమల్లు సినిమాకి టికెట్ల రేట్లను పెంచుకునేందుకు కూడా ఓకే చెప్పింది. ఈ మేరకు ఓ జీవో కూడా అధికారులు విడుదల చేశారు.హరిహరవీరమల్లు సినిమా 24వ తేదీ విడుదల అవుతుండగా ముందు రోజునే ప్రీమియర్ షోలు వేసుకునేందుకు అధికారులు అన్నీ అనుమతులు ఇచ్చారు.
ప్రీమియర్ షో టికెట్ ధర 600 రూపాయలుగా నిర్ణయించారు. లోయర్ క్లాస్ 100, అప్పర్ క్లాస్ 150, మల్టీప్లెక్స్ టికెట్ ధర 200 రూపాయల వరకు పెంచుకునేందుకు అనుమతులు లభించాయి. పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి రెండు తెలుగు రాష్ట్రాలు అనుమతులు ఇచ్చినట్టు నిర్మాతలు పేర్కొన్నారు.ఈ ఏడాది విడుదల కానున్న భారీ చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పవన్ కళ్యాణ్ హీరోగా.. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. పోరాట యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.

