విశాఖపట్నంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన కాన్వాయి కారణంగా 30 మంది విద్యార్థులు సకాలంలో జేఈఈ పరీక్షకు హాజరుకాలేక పోయారని , దీనివల్ల పరీక్ష రాసే అవకాశం మిస్ అయిందని దుమారం రేగింది. దీనిపై ప్రతిపక్షం వైసిపి విమర్శలు , సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి. అయితే ఇందులో నిజమెంత..? అన్నదే ఇప్పుడు సమస్య.. ఈ విషయమై విశాఖపట్నం పోలీస్ కమీషనర్ మరో రకమైన వాదనతో ముందుకొచ్చారు. పరీక్షకు హాజరుకాలేకపోయిన 30 మంది విద్యార్థుల వివరాలు తీసుకొని పరిశీలించారు.
వారి మొబైల్ ఫోన్లు ట్రాక్ చేసారు. ట్రాఫిక్ సిసి కెమెరా క్లిప్స్ చూసారు. జేఈఈ పరీక్షకు సకాలంలో రాలేకపోయిన పోయి ఇందుకు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణమని విద్యార్థులు చెబుతున్న మాటలు అబద్దమని తేల్చారు. దీన్ని రాజకీయం చేసి సమస్యను పక్కదారి పట్టించారని తెలిపారు. ఆ విద్యార్థులే ఆలస్యంగా వచ్చారని, వీరికి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ అడ్డంకి కాదని అన్నారు. ఆ రోజు ట్రాఫిక్ ఆంక్షలు కూడా లేవని స్పష్టం చేశారు..

