సృష్టిలో మనుషులే కాదు ,మనుషుల కంటే తెలివైన ,కొంతమంది మనుషుల ఆలోచనలు, క్రూరమైన లక్షణం కలిగిన ఓ కీటకం ఉంది . ఈ కీటకం ఎదుటి కీటకాన్ని ఎలా చంపేస్తుందో , ఎంత స్లోగా దాన్ని విషపూరితనం చేసి తన పని పూర్తయిన తర్వాత సమూలంగా నాశనం చేస్తుందో ఇదే ఉదాహరణ . ఇదొక అద్భుతమైన అంతుచిక్కని కీటకం ఇది. ఇలాంటి కీటకం మరొకటి ఉండదు. పారాసిటైడ్ జాతికి చెందిన కీటకం ఇది. కీటకాలలో పారాసిటైడ్లు ,పారాసైట్లు అనే రెండు రకాలు ఉంటాయి. పారాసైట్లు అంటే పరాన్నజీవులు. ఇవి ఒక పదార్ధం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి. అయితే పారాసిటైడ్లు అలా కాదు. ఎదుట జీవిని చంపేసి తాము బతుకుతాయి . దీనిపేరు ఓవిపాసిటర్. ఇది ఎదుటి కీటకాన్ని చంపే విధానం ఘోరంగా ఉంటుంది.
ఇది తన సంతానం కోసం ఎదుట కీటకాన్ని చంపుతుంది. ముఖ్యంగా గొంగళి పురుగుల లార్వాలోకి ఈ కీటకం తనలో ఉన్న గుడ్లను పంపుతుంది.. ఈ క్రమంలో కొన్ని వైరస్లను కూడా దాంతోపాటే లార్వాలోకి పంపుతుంది . దీనికోసం ఒక ఇంజక్షన్ సూది లాంటి పొడవాటి కొండె కూడా దానికి ఉంటుంది. ఈ విధంగా ఎదుటి కీటకాన్ని దానికి నొప్పి లేకుండానే కుట్టి తనలోని గుడ్లను , దానితోపాటే వైరస్ ను ఎదుటి కీటకం లోకి పంపించేస్తుంది .
అప్పుడు ఆ కీటకం బతికే ఉంటుంది. అది తన ఆహారాన్ని తాను తింటుంది. అయితే ఈ కీటకం , ఓవిపాసిటర్.తనలోకి పంపిన గుడ్లు లోపల పెరిగి పెద్ద అవుతున్నాయని, తాను తినే ఆహారం ఆ గుడ్లు తన శరీరంలోనే పొదిగి తన ఆహారాన్ని తింటున్నాయని ఈ కీటకానికి తెలియదు .ఇలా ఒక క్రమ పద్ధతిలో నిదానంగా దాన్ని లోపల తినడం మొదలుపెడతాయి. అంటే ఆ కీటకం బ్రతికున్నప్పుడే దాన్ని ఉదర భాగంలో మొత్తం అవయవాలు తిని ఇవి పెరుగుతాయి . ఆ తర్వాత ఆ కీటకం క్షీణించి చనిపోయిన తర్వాత ఇవి బయటకు వస్తాయి. ఇది ఈ కీటకం చేసే దుర్మార్గం కాదు సృష్టి ఆ విధంగా ఈ కీటకాన్ని సృష్టించింది.

