22.5 C
New York
Sunday, April 5, 2026

Latest Posts

జుట్టుపాకు తీగ రహస్యం ఏమిటో తెలుసా?

ప్రకృతి మనకు అద్భుతమైన వరాన్ని ఇచ్చింది అయితే చాలావరకు ఆ వరాలు ఏమిటో నేటితరానికి తెలియడంలేదు . ప్రకృతి ఇచ్చిన వరాలు మన చుట్టూ లేదా మన పెరట్లో ఉన్న వృక్షజాతులు. ప్రతి వృక్షానికి , ప్రతిమొక్కకు ,ప్రతి తీగకు ఏదో ఒక అర్థం పరమార్థం సృష్టి కలగజేసింది . గతంలో తోటల్లో గాని పొలాల్లో గాని పనులకు వచ్చే కూలీల్లో కొంతమంది ఆ పొలంలో పని ప్రారంభించే ముందు ఆ తోట లేదా పొలం కంచి చుట్టూ తిరిగి వస్తారు . లేదా ఆ పొలం పరిసర ప్రాంతాలలో కాసేపు పరిశీలించి ఆ తర్వాతే పనులకు దిగుతారు . ఎందుకో తెలుసా …? కారణం అడిగితే కొంతమంది చెప్పరు. మరి కొంతమంది చెబుతారు . పని ప్రారంభించే ముందు పొలంలో తేళ్లు గాని లేదా ఇంకా ఏదైనా కీటకాలు గానీ కుడుతాయేమోనని దానికి విరుగుడుగా వాడే పసరు మొక్క ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ఎక్కడుందో చూసి, ఆ తర్వాతనే పనులు మొదలు పెట్టడం జరిగేది.

అలాంటి మొక్కే ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నది. దీని పేరు దుష్టపు తీగ మొక్క . జుట్టు పాలఆకు అని కూడా అంటారు. ఇది తేలు లేదా ఇంకా ఏదైనా కీటకం కుట్టినప్పుడు దీని ఆకునలిపి ఆ పసరు ఆగాయంపై పోస్తారు . ఇలా చేస్తే తేలుకాటు విరుగుడు అవుతుందని పూర్వకాలం నుంచి కూడా నమ్మేవాళ్ళు . ఆ తర్వాత ఈ మొక్క ఆకులు రసం కొంచెం ఉప్పు కలిపి బాగా నలిపి గుడ్డతో వడగట్టి మూడు చుక్కలు చెవిలో వేస్తె చెవిలో చీము కారడం ఆగిపోతుందని చెప్తారు . అదే కాకుండా సంతాన భాగ్యం లేని వాళ్లకు కూడా ఇది మంచి ఔషధమని అంటారు. బహిష్టు అయిన రోజులలో నీడలో ఎండబెట్టిన ఈ మొక్క వేళ్ళు పొడిచేసి , మజ్జిగతోగానీ, పెరుగుతోగానీ ఒక చెంచాడు ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెబుతొంది. ఈ మొక్క వేళ్ళు ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.