22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

దేవుడా , మా పాకిస్తాన్ ని కాపాడు..ఎంపీ ఏడుపు

దేవుడా భారతదేశం నుంచి నా పాకిస్తాన్ ని కాపాడు నా పాకిస్తాన్ ప్రజలను రక్షించు అంటూ పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ఓ ఎంపి విలపించాడు. తాహీర్ ఇక్బాల్ అనే ఈ ఎంపీ గతంలో ఆర్మీ అధికారిగా కూడా పనిచేశాడు. అతడిని మేజర్ తాహీర్ అని పిలుస్తారు. భారతదేశం, పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం చేస్తూ దాడులచేయడంతో ఆయన ఏడ్చేశారు. పాకిస్తాన్ కు ,భారతదేశం నుంచి ముప్పుతుందన్నారు. దేశాన్ని కాపాడండి , కాపాడండి విలపిస్తూ పార్లమెంట్లో మాట్లాడిన మాటల ఈ వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది.

ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ , భారత్ లోని కీలక స్తావరాలపై చేసిన దాడుల ప్రయత్నాన్ని భారత్ సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని 15 స్థావరాలు పై దాడులు చేసేందుకు పాకిస్థాన్ డ్రోన్లను పంపించింది . అయితే మానవ రహిత గగనతల రాకెట్లను పంపి మన సైన్యం వాటిని నిర్వీర్యం చేసింది. అవంతిపురం, శ్రీనగర్, జమ్ము ,పఠాన్ కోట ,అమృత్సర్, కపూర్తల ,జలంధర్, లూథియాన ,ఆదంపూర్, బటిండా , చండీగర్, నాల్ అలోడి, ఉత్తరాలై మరియు బుజ్ ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులు చేసేందుకు డ్రోన్లను పంపింది .

అయితే వీటిని భారత్ గగనతలం లోనే నిర్వీర్యంచేసి కూల్చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్లో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టంను భారత్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ,దాడుల ప్రయత్నాలకు అనుగుణంగానే ఇలా సమాధానం చెప్పామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మేస్త్రి అన్నారు. ఉగ్రవాదం ఏ భూభాగంలో నుంచి అయినా సరే సహించే ప్రశ్న లేదని అందుకే దాడులు చేశామని స్పష్టం చేశారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.