ఉగ్రవాదంపై పోరులో భారత్ని చేతిలో చావు దెబ్బలు తిన్న పాకిస్తాన్ ఏదో ఒక విధంగా దేశంలో అలజడి, పౌరులలో అల్లకల్లోలం రేపాలని చూస్తోంది. ఆపరేషన్ సిందూర తరువాత , కాశ్మీర్ లో తీవ్రవాదుల వేటకు సైన్యం సన్నద్ధం అయింది. ఇల్లిల్లు గాలించి , తీవ్రవాదులను కాల్చి చంపుతుంది . దీంతో పాకిస్తాన్ మనదేశంపై సైబర్ వార్ చెయ్యాలని చూస్తోంది. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు తాజాగా డాన్స్ ఆఫ్ ది హిల్లరీ పేరుతో వాట్సాప్ , ఇంస్టాగ్రామ్ , మెయిల్స్ లో ఓ లింక్ పంపించి అల్లకల్లోలానికి కుట్ర చేసింది.
ఈ లింక్ ఇండియన్ డిఫెన్స్ అధికారులు పంపినట్టే ఉంటుంది. ఇది నొక్కితే , మొబైల్ కాంటాక్ట్ లిస్ట్ లోని వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోతాయి. బ్యాంకు అకౌంట్స్ వివరాలు, పాస్ వర్డ్స్ , ముఖ్యమైన సమాచారం మొత్తం పాకిస్తాన్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోతుంది. దీంతో అనేక ఆర్థిక, సామాజిక అనర్దాలు జరిగే అవకాశం ఉంది. అందువల్లనే పలు రాష్ట్రాల్లో పోలీసులు డాన్స్ ఆఫ్ ది హిల్లరీ పేరుతో ఈ లింక్ ఓపెన్ చెయ్యవద్దని సూచిస్తున్నారు..

