22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

చెట్టు నరికితే లక్ష ఫైన్ , సుప్రీం తీర్పు.

విచక్షణారహితంగా చెట్లు నరకడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. చెట్లు నరకడం అంటే మనిషిని చంపడమే అని ఆందోళన వ్యక్తం చేసింది. మారుతున్న కాలంలో , వాతావరణంలో మార్పులతో మనుషుల మనుగడ ఇబ్బందిగా ఉంది. పర్యావరణం నాశనం అయిపోతుంది. ఈ దుస్థితిని సరిదిద్దాలంటే చెట్లు పెంచడమే మార్గం. అలాంటి పరిస్థితుల్లో చెట్లు నరికితే యెంత ప్రమాదమో గ్రహించడంలేదని ఆందోళన వ్యక్తం చేసింది. చెట్లు నరికితే ఒక్కో వృక్షానికి రూ. లక్ష జరిమానా విధించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పులో పేర్కొంది. చెట్లను నరకడం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది.

దీనివల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని..వర్షాలు సరిగ్గా పడవు. వాయు కాలుష్యం పెరుగుతుంది. ప్రజలు అనారోగ్యం పాలవుతారు. అందుకే చెట్లను నరకడం నేరంగా పరిగణించాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరికీ పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసింది. దీన్ని సామాజిక బాధ్యతగా కూడా పరిగణించాలని స్పష్టం చేసింది. చెట్లను నాటి వాటిని సంరక్షించాలి. పర్యావరణాన్ని కాపాడితే మన భవిష్యత్తును మనం కాపాడుకున్నట్లేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. చెట్లు నరకడం మనిషిని చంపడం కంటే దారుణమని, పర్యావరణానికి నష్టం కలిగించే వారిపై దయ చూపరాదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అక్రమంగా చెట్లు నరికితే ఒక్కోదానికి రూ. 1 లక్ష జరిమానా విధించాలని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి.

ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

షర్మిల కొడుకు రాజకీయాల్లోకి ,మేనమామ జగన్ కి పోటీగా

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.