ఇది చాలా అరుదైన ఫోటో.. ఏసీబీ వలకు చిక్కి కూడా స్మైలింగ్ ఫేస్ తో ఫోటో తీయించుకున్నాడు. జగిత్యాల ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ రఘు.. ఇతడు ఒక పోలీస్ కానిస్టేబుల్ ని సీసీఎస్ డబ్బుల మంజూరుకు వేధించి లంచం తీసుకొని పట్టుబడ్డాడు..
సాధారణంగా ఎసిబి కేసుల్లో చిక్కినవారు , ఎంత దమ్మున్న అధికారి అయినా వణికిపోతారు. ఫొటో తీసేప్పుడు వాళ్ళ ముఖాల్లో ఆ భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే జగిత్యాల ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ రఘు మాత్రం లంచం తీసుకుంటూ పట్టుబడ్డా , నారూటే వేరు అన్నారు నవ్వుతూ ఎసిబి అధికారులు ఫొటో తీస్తున్నప్పుడు ఫోజు ఇవ్వడం నిజంగా సూపర్..

