గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్, ఆనాటి జగన్ కోటరీ పెద్దల మెప్పుకోసం సినీ నటి జేత్వానీని, ఆమె తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికించి , వేధించి జైలు పాలుజేసిన కేసు పోలీస్ వ్యవస్థనే బ్రష్టు పట్టించింది. ఈ కేసులో తాజాగా ఐపీఎస్ ఆఫీసర్లు, ప్రస్తుతం సస్పెన్షలో ఉన్న విశాల్ గున్నీ, కాంతిరాణా లకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్సార్ ఆంజనేయులు అరెస్టై జైల్లో ఉన్నాడు.
ఆమెను అనేక విధాలుగా హింసించి , అనుమతిలేకుండా విమానాలు, స్పెషల్ విమానాలలో పోయి , ముంబై నుంచి ఆమెను తీసుకొచ్చి , కేసుపెట్టకుండా వేధించి , హింసించి, చివరకు వృద్ధురాలైన ఆమె తల్లితండ్రులను కూడా జైల్లోపెట్టి పైశాచికంగా వ్యవహరించిన సాక్షాత్తు సీనియర్ ఐపీఎస్ అధికారులే భాగస్వాములు కావడం విశేషం. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే , జేత్వాని ఫిర్యాదుపై , తీగలాగితే డొంక కదిలింది. ఈ కేసులో అత్యుత్సాహం చూపించిన సీనియర్ ఐపీఎస్ అధికారులే సస్పెండ్ కావడం విశేషం..

