ప్రపంచంలో మానవాళి ఎదుర్కొంటున్న అనర్ధాలు, అరిష్టాలు, అనారోగ్యాలు కొత్త రకం జబ్బులు పెరుగుతున్న విజ్ఞానంతో పాటు అంతకంతకు పెరిగిపోతున్న ప్రమాదకర రోగాలు వీటన్నిటికీ కారణం ఏమిటో జపాన్ శాస్త్రవేత్తలు నూతన పరిశోధనల ద్వారా స్పష్టంగా వివరించారు. ప్రపంచంలో అడవులు నరికివేత, చెట్ల తొలగింపు, పచ్చదనం మాయం కావడమే చాలా రోగాలకు మూల కారణమని తెలిపారు. ఇటీవల జపాన్లోని నిప్పాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు కొంతమంది క్యాన్సర్ రోగులతో ప్రతి వారం మూడు రోజులు అడవుల్లో గడిపి వ. ఆ తర్వాత ఈ రోగులపై చేసే పరిశోధనలు అద్భుతమైన ఫలితాలు కనిపించాయి .
ఆ అడవులు మధ్య వారంలో మూడురోజులు రోజుకు ఎనిమిది గంటలకు పైన ఉండగలిగితే శరీరంలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని గుర్తించారు. వారంలో మూడు రోజులు అడవిలో ఉండడంతో క్యాన్సర్ శరీరంలో క్యాన్సర్ కారక కణాలను చంపే కణాల శాతం పెరిగిందని గుర్తించారు. వీటిని నేచురల్ కిల్లర్స్ అంటారు. ఈ న్యాచురల్ కిల్లర్ కణాలు క్యాన్సర్ రోగుల్లో 80 శాతం పెరిగాయని గుర్తించారు. ఇవి గణనీయంగా పెరగడాన్ని అద్భుతమైన పరిశోధన ఫలితంగా ప్రకటించారు. అడవుల్లో వారానికి మూడు రోజులు పగటిపూట గడిపి వస్తే శరీరం దానికి అంతట అదే స్వచ్ఛమైన గాలికి ప్రభావితమై రోగనిరోధక శక్తి కణాలను పెంచుకుంటూ ఉంటుందని చెప్పారు.
టోక్యోలోని నిప్పాన్ మెడికల్ స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిశోధనలో ఈ విషయాలు వెల్లడించారు. ప్రకృతి సిద్ధంగానే వృక్షాలు విడుదల చేసే ప్రకృతి సిద్ధమైన రసాయనం పైటోసైడ్స్ అనే కణజాలం. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించి ప్రమాదకర రోగాలపై పోరాటం చేయడంలో సహకరిస్తాయని తేల్చారు. అందువల్ల మందులు వాడకంతో పాటు అడవులలో జీవితం, పచ్చటి చెట్ల కాసేపు ఉండడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని తేల్చారు.. అందుకే ప్రకృతిలో చెట్లను దేవతలుగా పూజించారు మన పూర్వీకులు.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

