22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

టీకొట్టు తీవ్రవాది పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు

పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలున్న నూర్ మహ్మద్ ని ఎన్ ఐఏ బృందం చెన్నైలో విచారిస్తోంది. అతడికి మరో 35 ఏళ్ళ తాడిపత్రి మహిళతో సంబంధం ఉంది. ఆమెనుకూడా అదుపులోకి తీసుకున్నారు. టీ కొట్టులో పనిచేసే నూర్ మహ్మద్ ఇటీవల ఖరీదైన స్థలం కొని , అందులో అధునాతనమైన ఇల్లుకూడా కడుతున్నాడు. ఇతడికి ఉగ్రవాదులనుంచి డబ్బులు అందాయని తెలుస్తోంది. పెళ్ళైన తరువాత ఇతడిని భార్య వదిలేసింది. అతడికి వ్యభిచారం అలవాటు ఉందని , అందువల్ల తానూ విడిపోయానని భార్య చెబుతొంది. టీ కొట్టులో ఛాయ్ మాస్టర్ గ పనిచేసే ఇతడికి గత కొన్నేళ్లుగా పాక్ తీవ్రవాదులతో సోషల్ మీడియాద్వారా లింక్స్ ఉన్నాయి.. పగలు వంటవాడి అవతారంలో కనిపిస్తాడు మహ్మద్‌ నూర్‌. రాత్రయితే పాకిస్తాన్‌లోని ఉగ్ర మూకలతో వాట్సప్‌ చాట్స్‌తో బిజీబిజీగా ఉంటాడని పోలీసులు చెబుతున్నారు.మొదట ఇతడి చాటింగ్ ని చెన్నైలోని ఎన్ ఐఏ అధికారులు గుర్తించి , అతడి చాటింగ్ ని ట్రాక్ చేసారు. స్థానిక పోలీసులకు అసలు సమాచారమేలేదు. చెన్నై టీమ్ వచ్చినతరువాత , స్థానిక పోలీసుల సహకారం తీసుకుని , అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మౌలానా మసూద్ అజహర్ స్థాపించిన జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోంది. భారత్‌పై ఉగ్రదాడులు చేయడమే దీని లక్ష్యం. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి భారీ ఉగ్రదాడులకు పాల్పడింది ఈ ఉగ్ర మూక. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. భారత్‌లో అతనిపై వారెంట్లు ఉన్నాయ్. పాక్‌లోని ఇలాంటి అతి భయంకర ఉగ్రవాద సంస్థ, ధర్మవరం దాకా విస్తరించడం కలవవరం రేపుతోంది. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద కదలికల వ్యవహారంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దర్యాప్తు సంస్థల అదుపులో ఉన్న నూర్‌ మహమ్మద్‌ షేక్‌కు జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది.దీనిపై మరింత సమాచారం అతగాడి భార్య ఇవ్వడం జరిగింది. నూర్‌కు అమ్మాయిల పిచ్చి ఉంది కానీ, పాకిస్తాన్ పిచ్చి ఉందని తనకు తెలియదంటోంది అతగాడి భార్య. నూర్‌కి వివాహేతర సంబంధాలు ఉన్నాయని, అందుకే అతడి నుంచి తాను విడిపోయానని చెబుతోంది .

తాజాగా ధర్మవరంలో ఉగ్ర నీడలు కనిపిస్తే…రెండు నెలల క్రితం అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాద కదలికలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఏడాది జూన్‌లో తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ రాయచోటిలో నిర్వహించిన సోదాల్లో…అబూబకర్ సిద్దిక్‌, మహమ్మద్ అలీ అనే ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసింది. వీళ్లు తమిళనాడులో చాలాచోట్ల బాంబు దాడులకు పాల్పడ్డారు. మారుపేర్లతో రాయచోటిలో తలదాచుకున్నారు. ఇక ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్‌ స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్ అయ్యాయి. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్‌ కలిసి హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. దీనికోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. ఉగ్రవాదుల పన్నాగాన్ని పసిగట్టిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు, ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎక్కడి పాకిస్తాన్‌…ఎక్కడి ధర్మవరం, రాయచోటి, విజయనగరం…ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతాలను టెర్రరిస్టులు తమ షెల్టర్‌ జోన్లుగా మార్చుకున్నారా? ప్రశాంతంగా ఉండే ఏపీలో ఎవరూ తమను పసిగట్టలేరనే ధీమాతో అక్కడ గుట్టుచప్పుడు కాకుండా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారా? ఏపీలో చాప కింద నీరులా విస్తరిస్తున్న ఉగ్రమూకల స్థావరాలను పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన టైమ్‌ వచ్చింది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.