జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ అనేది మీడియా సృష్టించినదేనని , దీనితో సినిమా పరిశ్రమకు ఏమీ సంబంధం లేదని ఎఫ్ డిసి చైర్మన్ దిల్ రాజు అన్నారు. తన సినిమా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కి ముందు , థియేటర్లు బంద్ చెయ్యాలన్న కొంతమంది నిర్ణయంపై పవన్ కళ్యాణ్ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఒక్కొక్కరు , ఒక్కొక్క ఎజెండా వస్తే మాట్లాడలేదు.. సినీ పరిశ్రమ ఒక్కటై వస్తేనే చర్చలు , లేదంటే ఎంతకైనా సిద్దమే అని పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పడంతో సినిమా పెద్దలు ఆలోచనలో పడ్డారు. పవన్ కళ్యాణ్ తెగిస్తే , ఎంతకైనా సిద్దపడతాడని భయపడ్డారు.
తమ బెదిరింపులకు ఎవరూ ప్రభుత్వంలో భయపడరని తెలుసుకొని దిగొచ్చారు. నిన్న అల్లుఅరవింద్ ప్రకటన ఇచ్చారు. థియేటర్ల బంద్ అని చెప్పిన నలుగురు పెద్ద మనుషుల్లో తాను లేనని చెప్పేసారు. ఈ రోజు దిల్ రాజు ముందుకొచ్చి , పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవరికీ లేదన్నారు. థియేటర్ల బంద్ నిర్ణయంతో తమకు సంబంధం లేదన్నారు.మాలో మాకే సయోధ్య లేదు…మొన్న అరవింద్ గారు ప్రెస్‌మీట్ పెట్టారు, ఈ రోజు నేను అంటూ సర్దుకున్నారు.కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు.ప్రభుత్వానికి ఎవరో తప్పుగా సమాచారం ఇచ్చారని చెప్పారు.

