తిరుమలలో వేపచెట్టు పెరగదా ? కాలమానాలకు అతీతం శ్రీవారి ప్రాభవం. తిరుమల కొండల్లో అదేమి ప్రకృతి విచిత్రమో గానీ తిరుమలలో వేపచెట్లు కనిపించవు. సాధారణంగా వేపచెట్లు లేని ఊరు ఉండదు. అవిలేని పరిసరాలుకూడా ఉండవు. కానీ తిరుమల కొండల్లో వేపచెట్లు ఇతర ప్రాంతాల్లో కనిపించినంతగా కనిపించవు. దీనికి కారణం ఏమిటో అక్కడివారుకూడా చెప్పడంలేదు. ఏడుకొండల్లో అన్ని రకాల వృక్షలు, మొక్కలు, అరుదైన పక్షులు, జంతువులు , మానవుడు ఇంతవరకు చూడని లోయలు, జలపాతాలు, గుహలు ఉన్నాయి.
కానీ సాధారణంగా కనిపించే వేపచెట్టుమాత్రం కొండల్లో గానీ, తిరుమలలో గానీ కనిపించవు. వేపచెట్లు వ్యాప్తికి కాకులు ప్రధాన కారకాలు. వేప పండ్లు తిని , విత్తనాలు వ్యాప్తిచేస్తాయి. ఆ విధంగా కూడా తిరుమలలో కాకుల అలజడికూడా తక్కువే. తిరుమల కొండల్లో ఋతువులుకు అతీతంగా వృక్షాలు నిత్యకళ్యాణం , పచ్చతోరణంగా ఉంటాయి..కాలమానాలకు అతీతంగా భక్తుల వరద సాగుతూనే ఉంటుంది. అది ఆగదు. గత పాతికేళ్లలో కరోనా కాలంలో తప్ప ఏనాడూ స్వామివారికి రోజువారీ హుండీ , మూడుకోట్ల రూపాయలకు తగ్గలేదు..

