22.5 C
New York
Saturday, April 4, 2026

Latest Posts

నిసర్ ఉపగ్రహ ప్రయోగం రేపు సాయంత్రమే.

తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ బృందం దర్శించుకుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఇస్రో సంయుక్తంగా తయారుచేసిన నిసర్ ఉపగ్రహాన్ని 30 వతేది ప్రయోగించనున్న సందర్భంగా , శాస్త్రవేత్తలు స్వామివారిని దర్శించుకున్నారు. ఇస్రో నుంచి ఎప్పుడు ఉపగ్రహ ప్రయోగాలు జరిగినా తిరుమల స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ.నిసర్ ఉపగ్రహంలో రెండు ముఖ్యమైన పేలోడ్స్ ఉంటాయి. ఈ శాటిలైట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.

జీఎస్ఎల్వీ మార్క్-2 రాకేష్ ద్వారా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. 30 వతేది సాయంత్రం 5.40 నిమిషాలకు ఈ ప్రయోగం జరగనుంది భూ ఉపరితలం పరిశీలన, ఉపద్రవాల హెచ్చరికలు, అనేక రకాలుగా ఈ శాటిలైట్ ఉపయోగపడనుంది .12 రోజుల్లో భూమి మొత్తము చుట్టేస్తుంది.. శాటిలైట్ ద్వారా వచ్చే డేటా ను గ్లోబల్ కమ్యూనిటీ వెల్ఫేర్ కు ఉపయోగపడుతుందని తెలిపారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.