22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

నిమిషప్రియకు ఇక 36 గంటలే జీవితం.

ఎమెన్ దేశపు జైల్లో చివరి ఘడియలు లెక్కబెడుతున్న కేరళకు చెందిన నర్స్ నిమిషప్రియ ఆశలు అడుగంటిపోయాయి. భారత ప్రభుత్వం కూడా ఆమె శిక్ష విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పేసింది. ఆ దేశంతో ఉన్న దౌత్య సంబంధాలు ,అక్కడున్న సున్నితమైన రాజకీయ పరిస్థితులు దృష్ట్యా నిమిషప్రియ విషయం దౌత్యపరంగా తాము ఏమీ చేయలేమని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. భారత దేశానికి ఆదేశంతో దౌత్య సంబందాలుకూడా లేవు. ఆమెను మరణశిక్ష నుంచి తప్పించాలని కోరుతూ భారత ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయింది .

ఈ మేరకు సుప్రీంకోర్టు కూడా కేంద్రానికి సమాచారం పంపి సమాధానం చెప్పాల్సిందిగా కోరింది . ఈ విషయమై కేంద్ర న్యాయ మరియు విదేశీ మంత్రిత్వ శాఖలు దాఖలు చేసిన పిటిషన్లలో ఎమెన్ దేశంతో సంప్రదింపులు విషయంలో తామేమీ చేయలేమని, అక్కడ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని స్పష్టం చేశారు . దౌత్యపరమైన సంబంధాలు కూడా రెండు దేశాల మధ్య లేవని పేర్కొన్నారు. ఇది కాకుండా ఎమెన్ దేశంలో మరణశిక్ష పడిన ఖైదీలకు బ్లడ్ మనీ అవకాశం ఉంది . బ్లడ్ మనీ అంటే బాధిత కుటుంబానికి చెందిన వారికి నష్టపరిహారంగా భారీ మొత్తంలో చెల్లించి శిక్ష నుంచి తప్పించుకోవడం.

దీనిని ఎమన్ దేశంలో బ్లడ్ మనీ గా పిలుస్తారు. అంటే మన దేశంలో స్థానిక భాషలో చెప్పాలంటే రక్తపు కూడు అని అర్ధం. అయితే ఇది కోర్టు ద్వారా కాకుండా మూడో వ్యక్తి ప్రమేయంతో జరిగే ప్రక్రియ . ఇది చట్టసమ్మతం కాదు. అలా డబ్బులు ఇవ్వడం కూడా మన దేశం నుంచి నిబంధనలు ఒప్పుకోవు . అందువల్ల ఈ విషయంలో కూడా కోర్టులు ఏమి చేయలేవు. ఈ పరిస్థితుల్లో ఆమెకు 16వ తేదీ మరణశిక్ష విధించబోతున్నారు . అంటే మరొక మరొక 36 గంటలే ఆమెకు సమయం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చేతులెత్తేయడంతో నిమిషప్రియ మరణశిక్ష ఖరారయ్యే అవకాశంమే కనిపిస్తోంది.

 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.