యెమెన్ దేశంలో భారతీయ మహిళను మరో వారం రోజుల్లో ఉరి తీయబోతున్నారు. ఉరిశిక్ష రద్దుకు కేరళలోని ఆమె తల్లిదండ్రులు ఎంతగా ప్రాధేయపడుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. 36 ఏళ్ల నిమిషప్రియ అనే మహిళ అక్కడ చాలా హాస్పిటల్స్ లో నర్స్ గా పనిచేసింది . ఆమెతో కలిసి పనిచేసే యెమెన్ పౌరుడిని హత్య చేసిందన్న ఆరోపణలపై 2018 సంవత్సరం నుంచి అక్కడ కేంద్రకారాగారంలో ఉంటుంది. ఈ నేరంపై ఆమెను ఉరితీయాలని 16వ తేదీ నాటికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 16వ తేదీ తెల్లవారుజామున ఆమె ఉరికంబం ఎక్కిస్తారు. 2017 ఆగస్టు నుంచి ఆమె ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఆమెకు శిక్ష ఖరారు అయింది.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిష నర్సింగ్ కోర్స్ చదివి అక్కడ పనిచేసేందుకు వెళ్ళింది. 2008వ సంవత్సరంలో ఆమె అక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పలు హాస్పిటల్ లో నర్సుగా పనిచేసింది. 2014లో సొంతంగా క్లినిక్ ప్రారంభించాలని నర్సు ఉద్యోగం వదిలేసింది . అయితే సొంతంగా బిజినెస్ పెట్టేందుకు నిబంధనలప్రకారం ఆమె యెమెన్ దేశస్థుడుతో కలిసి వ్యాపారం ప్రారంభించాలి. ఆ దేశంలో విదేశీయులు ఎవరూ సొంతంగా వ్యాపారాలు ప్రారంభించకూడదు. ఆ దేశ పౌరుల భాగస్వామ్యం లేకుండా సొంతంగా ఎవరు వ్యాపారాలు ప్రారంభించకూడదు. దీంతో అక్కడ హందా అనే వ్యక్తితో కలిసి మెడికల్ క్లినిక్ అని 14 పడకల హాస్పిటల్ ను ప్రారంభించింది.
ఈ హాస్పిటల్ మొదలుపెట్టిన తరువాత యెమన్ లో సివిల్ వార్ మొదలయింది.అయినా అక్కడే ఉండి పోవాలని కూడా ఆమె నిర్ణయించుకుంది. ఆ తర్వాత బిజినెస్ భాగస్వామితో విభేదాలు వచ్చాయి. అతడు ఆమె డబ్బులు మరియు పాస్పోర్టు . ఇలాంటివన్నీ కూడా స్వాధీనం చేసుకొని తానే ఆమె భర్తను అంటూ బెదిరించి హింస పెట్టాడు ఆ తర్వాత ఆమె 2016లో పోలీసులు ఫిర్యాదు చేసిన వాళ్లు పట్టించుకోలేదు . దీంతో 2017లో ఆమె అతడికి కేటామైన్ అని మందు ఇచ్చి మహదిని చంపేసింది. అయితే ఆమె తరపు న్యాయవాదులు మాత్రం అతడికి నిద్ర మాత్రలు ఇచ్చి అతని వద్ద ఉన్న పాస్పోర్టు తనకు సంబంధించిన ఇతర వస్తువులు తీసుకుని ఆమె స్వదేశానికి రావాలని ప్రయత్నాలు చేసిందని అయితే మందు ఓవర్డోస్ అయి అతడు చనిపోయాడని వాదించారు. యెమెన్ కోర్టులు ఈ వాదన పట్టించుకోలేదు. 2018లో ప్రియను హత్య నేరం కింద ఉరిశిక్ష విధించారు .

