ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది ఉగ్రవాదమా ..? సోషల్ మీడియా ఉన్మాదమా..?? ఇప్పుడు ఇది పలువురు మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న . మానవాళి ముందున్న అతిపెద్ద సవాల్ . నేపాల్ లో జరిగిన హింసాత్మక సంఘటనలు చూస్తే సోషల్ మీడియా పిచ్చి ప్రజల్లో ఎంతగా ప్రబలిపోయిందో, పేరుకుపోయిందో , అది ఉగ్రవాదం కంటే భయంకరంగా ఎలా తయారవుతుందో నేపాల్ లో జరుగుతున్న హింస ,అల్లర్లు ప్రత్యక్ష నిదర్శనం . ప్రస్తుతం నేపాల్ ప్రధానమంత్రి మరియు మంత్రులను వాళ్ళ ఇళ్లలోకి జొరబడి తరిమి తరిమి కొట్టడం, వారి కుటుంబ సభ్యులను చంపేయడం, వీధుల్లో మంత్రులను కొట్టుకుంటూ, కాళ్లతో తన్నుకుంటూ తీసుకుపోవడం, తరుముకోవడం చూస్తుంటే సోషల్ మీడియా పిచ్చిలో యువత ఏమిచేస్తున్నారో వారికే అర్ధంకాని పరిస్థితి.
ఆందోళనకారులకు భయపడి మంత్రులు, ప్రధానమంత్రి రాజీనామాలు చేసి పారిపోవడం బహుశా ప్రపంచ చరిత్రలో ఇదే ప్రథమం . ఇంతకీ ఇంత దారుణమైన తిరుగుబాటు, పోరాటం ఆకలి కోసమో, అన్నం కోసమో , హక్కుల కోసం లేదా పేదరికం పైన ,అవినీతిపైన కానే కాదు . ఇది కేవలం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై నిషేధం విధించినందుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం . నేపాల్ లో రిజిస్టర్ గాని 26 సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను అంటే ఫేస్బుక్ ,యూట్యూబ్ లను ప్రభుత్వం నిషేధించింది . ఈ నిషేధం తప్పని, సోషల్ మీడియా ప్లాట్ఫారం తిరిగి దేశంలో అనుమతించాలని కోరుతూ యువకులు ఉద్యమిస్తున్నారు . వీరంతా ఖాట్మండులో ఓచోట సమావేశమై ఉద్యమానికి రూపకల్పన చేసుకుంటుండగా కొంతమంది యువకులు మోటార్ సైకిళ్లతో తో విచ్చలవిడిగా స్టంట్ లు చేస్తూ, ఫీట్స్ చేస్తూ తిరుగుతూ కనిపించారు.
వీరిపైన రక్షణ దళాలు లాఠీలు ప్రయోగించాయి. దీంతో యువకులు రెచ్చిపోయి సమీపంలో ఉన్న పార్లమెంట్ భవనం మరియు మంత్రులు, ప్రధానమంత్రి ఇళ్లలోకి జొరబడి దాడులు చేసారు. దీంతో ఆందోళన ఉధృతం అవడంతో మంత్రులు ప్రధానమంత్రి కూడా తమ పదవులకు రాజీనామాలు చేసి దేశం వదిలి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. చివరకు ప్రధానమంత్రి భవనాన్ని తగలబెట్టి , దారుణంగా కొట్టారు. ప్రధానమంత్రి భార్య కూడా ఆ మంటలకు చనిపోయారు .మాజీ ప్రధానమంత్రిని కూడా కొట్టారు . ఇంత దారుణమైన ఆందోళన ,తిరుగుబాటు సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా జరగడం విశేషం. ఇది మేధావుల్లోనూ రాజకీయాల్లో ఒక ఆలోచన రేకెత్తించింది. సోషల్ మీడియా పిచ్చి యువకుల్లో ఉగ్రవాదానికంటే భయంకరంగా పెరిగిపోయిందని అర్ధమైంది. సోషల్ మీడియా పిచ్చి కూడా తీవ్రవాదం లాగే తయారైంది. ఇది ఉగ్రవాదం కంటే భయంకరంగా మారుతుంది . దీనికి నేపాల్ సంఘటనలే ఉదాహరణ.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

