చిన్నప్పుడే కళ్ళుపోయి, ఐఏఎస్ కి సెలెక్ట్ అయ్యి.. ఇది ఓ తల్లి త్యాగం..తెలిస్తే కన్నీరు ఆపుకోలేము..తల్లి ప్రేమకు మాటలు ఉండవు.. అది అనంత కోటి మాటల వరాల మూట.. ఎంతచెప్పినా తల్లిప్రేమ చెప్పడం వీలుకాదు. ఎంత చెప్పినా తరగని త్యాగాలకోట.. అది అనుభవంలోనే తెలుస్తుంది. అలాంటి తల్లి ప్రేమకు ఇదో నిదర్శనం.. 8వ తరగతిలోనే అందత్వం ప్రాప్తించిన కొడుకును ఐఏఎస్ కు ఎంపిక చేయడంలో ,ఆల్ ఇండియా 91వ ర్యాంకు రావడంలో కీలక పాత్ర పోషించి , తన త్యాగాన్ని ప్రేమను, అభిమానాన్ని, కొడుకు విజయంలో చూసుకుని కన్నీటితో మురిసిపోయిన ఒక మహనీయురాలైన తల్లి చరిత్ర ఇది..

మనూగార్గ్ అనే 23 ఏళ్ల కొడుకు ,ఎనిమిదో తరగతిలోనే మహమ్మారి లాంటి జబ్బు సోకి అంధుడయ్యాడు. అయితే అతడి తల్లి ఆ కొడుకును , తానే దీపమై నడిపించింది.. చదివించింది .. ఆ కొడుకును ఈరోజు భారతదేశంలోనే 91 వ ర్యాంకు ఐఏఎస్ సాధించే స్థితికి తెచ్చింది. తన జీవితాన్ని వదులుకొని ,కొడుకుకు ఒక ఉజ్వలమైన జీవితాన్ని ఇచ్చి ఆ జీవితంలో తను పోగొట్టుకున్న వెలుగును చూసుకుంటుంది జైపూర్ కు చెందిన మనూగార్గ్ తల్లి వందన జైన్. అతడికి అంధత్వం సోకిన ఎనిమిదో తరగతి నుండి పాఠాలు చదివి, వినిపించి, నేర్పించి సెకండరీ స్కూల్ రాష్ట్రస్థాయిలో ఉత్తీర్ణుడు అయ్యేటట్టు చేసింది. ఆ తర్వాత డిగ్రీని ఢిల్లీలోని హిందూ కాలేజీలో చేయించింది.

ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చేర్పించి తనే దగ్గరుండి చదివించింది . ఆ తర్వాత కొడుకును నువ్వు ఏం చేస్తావు అని అడిగింది.. దానికి కొడుకు చెప్పిన సమాధానం ఒకటే …. నువ్వు ఏం చేయమంటే అది చేస్తానమ్మా అన్నాడు. అప్పుడు తల్లి అతడిని కోరిన కోరిక .. నువ్వు ఐఏఎస్ఐ చదివి కలెక్టర్ కావాలి అన్నది.. తల్లి కోరిక మేరకు గార్గ్ కష్టపడి చదివాడు.యూపీఎస్సీ సిలబస్ లో ప్రశ్నలు ,జవాబులు ,ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ .ఇలా సిలబస్ కి సంబంధించిన అన్ని విషయాలను తల్లి చదివి వినిపించేది.పుస్తకాల్లో ఉన్న జవాబులు చెప్పేది . వాటిని వివరించి, విశదపరిచి అర్థమయ్యేట్టు చేసేది. ఆ తర్వాత సిలబస్ కు సంబంధించిన ఆడియో బుక్స్ తీసుకువచ్చి కొడుకుకు వినిపించేది.

ఇలా అవిశ్రాంతంగా కొడుకును ఐఏఎస్ చేయాలన్న సంకల్పంతో ,లక్ష్యంతో పనిచేసింది. ఆ చివరకు ఆమె కోరిక ఫలించింది . గార్డ్ ఐఏఎస్ కు సెలెక్ట్ అయిన తర్వాత గార్గ్ చెప్పిన మాట ఒకటే .. ఈ విజయం నా తల్లికి, నా తల్లి పాదాలకు , నా తల్లి త్యాగానికి నేను ఇచ్చుకునే ఓ చిన్న కానుక అని చెప్పి ఒక మాటలో తల్లి ప్రేమకు, తల్లి ప్రేమ ఎలా ఉంటుందన్నా నిజాన్ని చెప్పాడు. తల్లి ప్రేమను ఎలా నిజం చేయాలో, కన్న ప్రేమకు రుణం తీర్చుకోవాలో నిరూపించాడు..

