పెళ్లి చూపుల్లో చూసిందేమో అందమైన అమ్మాయే.. పెళ్లిపీటలపై మాత్రం ఆ పెళ్లికూతురు తల్లి ముసుగేసుకుని కూర్చుంది. పెళ్లి తంతులో పెళ్లికూతురు పేరు మౌల్వి చెప్పేటప్పుడు అనుమానం వచ్చిన పెళ్ళికొడుకు , ముసుగు తొలగించి చూస్తే , పీటలమీద పెళ్ళికూతురికి బదులు పెళ్లి కూతురు తల్లి ఉంది. దీంతో పెళ్లి కొడుకు షాక్ తిని, మోసం, మోసం పోలీస్ స్టేషన్ కి పరుగులు తీశాడు .
పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాల్లో ఉత్తరాది రాష్ట్రాలు మొదటి స్థానంలోనే ఉంటాయి. దానిలో ఈ సంఘటన పరాకాష్ట.. ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో పెళ్లి పీటల మీద వధువుకు బదులు వధువు తల్లి కూర్చుంది . మీరట్లో బ్రహ్మపురి అనే ప్రాంతానికి చెందిన అజీమ్ అనే యువకుడికి శ్యామల జిల్లా జిల్లాకు చెందిన మంతషా అనే యువతితో పెళ్లి కుదిరింది .
పెళ్ళికొడుకు వయసు 22 ,పెళ్లికూతురు వయసు 21 ఏళ్ళు . అయితే నిఖా సమయంలో మత గురువు పెళ్ళికూతురు పేరును తాహిరా అని పలికాడు. దీంతో పెళ్లి కొడుకుకి అనుమానం వచ్చింది. వెంటనే పెళ్లికూతురు ముసుగు తొలగించి చూశాడు . పెళ్లికూతురు బదులు పెళ్ళికూతురు తల్లి తాహిర ఉంది. ఆమె వయసు 45 సంవత్సరాలు ..
ఇదేమి మోసమంటూ పెళ్ళికొడుకు గగోలు పెట్టాడు . తల్లిదండ్రులు లేని ఆ పెళ్ళికొడుకు తరఫున అతడి అన్న వదినలు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. వీళ్ళిద్దరూ అమ్మాయి తల్లితో కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఈ ఘోరానికి తెగించారని తెలిసింది. దీంతో మోసపోయానని గ్రహించిన పెళ్ళికొడుకు పోలీస్ స్టేషన్ పరుగులు తీసి ఈ పెళ్లి కోసం ఐదు లక్షలు ఖర్చు పెట్టానని ,ఆ డబ్బులు అయినా ఇప్పించమని ప్రాధేయపడ్డాడు..

