భారతదేశ ఆరోగ్యరంగం నైతికవిలువల పరంగా పతనం అంచున ఉందని పలు సర్వేలు తేల్చాయి. దీనిని భారత పార్లమెంటరీ కమిటీ కూడా అంగీకరించింది. తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలో జరుగుతున్న సర్జరీల్లో సుమారు 44 శాతం ఆపరేషన్లు నకిలీ, మోసపూరిత లేదా అవసరం లేని వాటిగా తేలాయి.. అంటే దేశంలో జరుగుతున్న దాదాపు సగం ఆపరేషన్లు కేవలం రోగులను లేదా ప్రభుత్వాన్ని మోసం చేసి డబ్బు సంపాదించడానికే చేస్తారు. నీచమైన పనికి పాల్పడుతున్న వాటిలో కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కువ. ఆ నివేదిక ప్రకారం 55 శాతం గుండె ఆపరేషన్లు, 48శాతం గర్భాశయం తొలగించే శస్త్రచికిత్సలు , 47 శాతం క్యాన్సర్ సర్జరీలు, 48 శాతం మోకాలి మార్పిడి ఆపరేషన్లు, 45% సిజేరియన్ డెలివరీలు, అవసరం లేకపోయినా డబ్బుకు కక్కుర్తిపడి చేస్తారు.భుజం, వెన్నెముక వంటి శస్త్రచికిత్సలలో సగం వరకు అవసరం లేనివి లేదా నకిలీగా జరుగుతున్నాయని తేలింది.
మహారాష్ట్ర, మరియు ఇతర రాష్ట్రాలలో లోని ప్రముఖ ఆసుపత్రుల్లో జరిగిన సర్వేలో, పెద్ద ఆసుపత్రుల్లో సీనియర్ వైద్యులకు నెలకు ఒక కోటి రూపాయల వరకు జీతాలు ఇస్తున్నారని తేలింది. దానికి కారణం అవసరం ఉన్నా లేకపోయినా ఎవరు ఎక్కువ టెస్టులు, చికిత్సలు, అడ్మిషన్లు, ఆపరేషన్లు చేయిస్తారో , వారికే ఎక్కువ జీతం లేదా బోనస్ ఇస్తారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం మరణించిన రోగులను కూడా బతికినట్టుగా చూపించి చికిత్స చేసిన ఘటనలు బయటపడ్డాయి.
ఒక ఘటనలో, ఒక ప్రసిద్ధ ఆసుపత్రి 14 ఏళ్ల బాలుడిని ఇప్పటికే చనిపోయినా బతికినట్టుగా చూపించి ఒక నెల పాటు వెంటిలేటర్ మీద ఉంచి, కుటుంబం నుండి లక్షల రూపాయలు వసూలు చేసింది.. తరువాత అతడిని చనిపోయినట్టుగా ప్రకటించారు. దర్యాప్తులో ఆసుపత్రి దోషిగా తేలి కుటుంబానికి 5 లక్షలు పరిహారం ఇచ్చారు.. కానీ కుటుంబం ఎదుర్కొన్న మానసిక బాధకు ఎవరు బాధ్యులు ఎవరో దేవుడికే తెలియాలి. కొన్ని సందర్భాల్లో, మరణించిన రోగిపై కూడా తక్షణ శస్త్రచికిత్స జరుగుతోందని నటించి డబ్బు వసూలు చేసి, తర్వాత “ఆపరేషన్ సమయంలో చనిపోయారు” అని చెప్పే సంఘటనలు బోలెడు.ఉన్నాయి.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

