మానవుడిపై చంద్రుడు ప్రభావం ఆధ్యాత్మికంగానే కాక శాస్త్రీయంగా కూడా అనేక పరిశోధనకు కారణం అయింది. మానవ జీవితంలో చంద్రుడి ప్రభావం పై పురాణాలే కాదు ,ఆధునిక శాస్త్రం కూడా నిర్ధారించింది . మతిభ్రమించిన వాళ్లు ,మెదడు సంబంధమైన వ్యాధులు ఉన్నవాళ్లు పరిస్థితి అమావాస్య ,పౌర్ణమి రోజుల్లో వారిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంటుంది. అందుకని ఆ రోజుల్లో మాత్రం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు. చంద్రకళలను బట్టి సముద్రం అటు పోటు కూడా ఉంటుంది .
చంద్రుడికి భూమికి మధ్య దూరాన్ని బట్టి ఇది సంభవిస్తుంది . అందుకే అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్ర స్నానం మంచిదంటారు. చంద్రకళల శక్తి , ప్రభావం ఆధ్యాత్మికంగానూ శాస్త్రీయంగాను అనేక రోగాలను నయం చేస్తుందని , మానసిక రోగులను ప్రభావితం చేస్తుందని చెప్తారు. ఆధ్యాత్మికంగా అయితే చంద్రుడు లేదా ఆ చంద్రుడి గమనం ,చంద్రకళలు మానవ జీవితం పై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. అందుకని జాతకరీత్యా కూడా ఏదైనా ఒక వ్యక్తి జాతకాన్ని పరిశీలించి, చంద్రుడు ఉండే రాశిని పరిగణనలోకి తీసుకుంటారు, చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ వ్యక్తి జాతకం ఆ రాశిపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.
అమావాస్య పౌర్ణమి రోజులలో సముద్ర స్నానం కొత్త ఆలోచనలు , కొత్త జీవితం ప్రారంభానికి అవకాశం ఇస్తుందని చెప్పారు. అందుకే ఆ రోజుల్లో సముద్ర స్నానం చేస్తున్న సమయంలో సముద్రంపై చంద్రుడు ప్రభావం స్పష్టంగా కంటికి కనిపించేట్టు ఉంటుంది . అందువల్లనే పౌర్ణమి లేదా అమావాస్య రోజుల్లో సముద్ర స్నానాలు చేస్తూ చంద్రకళల మానవుడిపై పడి తద్వారా కొన్ని అర్థం కాని సమస్యలు , శాస్త్రానికి అందని సమస్యలు లేదా ఇతరత్రా వ్యాధులకు కొంతవరకు పరిష్కారం లభిస్తుంది నమ్ముతారు . ఆయుర్వేదంలో కూడా వాత, పిత్త దోషాలకు సముద్ర స్నానం అత్యుత్తమమైనదని చెబుతారు.

