చరిత్రలో ఛత్రపతి శివాజీ ఉడుముకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఉడుమును ఉపయోగించే శత్రు దుర్బేధ్యమైన సింహ ఘడ్ కోటను శివాజీ కమాండర్ తానాజీ ఆక్రమించాడని చెబుతారు. 1670 లో శివాజీ కమాండర్ తానాజీ ఉడుము ద్వారా కోటపైకెక్కి , కోటలో మార్గాలను కనుగొని , కోటను మిగిలిన సైనికులను కూడా కోటపైకి తాళ్లద్వారా రప్పించి చేసుకున్నాడని చెబుతారు. ఉడుముకు ఉన్న శక్తిని తెలిపే చారిత్రక కథనం ఇది.. అయితే ఉడుముకు అంత శక్తి ఉందా..? తాడుకి కట్టి పైకి పంపినతరువాత , అక్కడ ఉడుము గోడకు అతుక్కుపోతే , ఆ తాడును పట్టుకొని , మనిషి పైకి పోగలడా..? ఇంత శక్తి ఉడుముకు ఎలా వచ్చింది.. ?
శాస్త్రీయంగా చూస్తే ఉడుముకు అంత శక్తి ఉందని సైన్స్ కూడా చెబుతొంది. ఉడుము చిన్నదైనా , దాని నాలుగు కాళ్ళ నిర్మాణం , దాని ఉదర భాగం , దానికి అంత శక్తిని ఇచ్చిందని కిచెబుతారు. ఉడుము వేళ్ళల్లో సెటై అనే చిన్న రోమాలను పోలిన భాగాలు కొన్ని లక్షలు ఉంటాయి. ప్రతి సెటై , శాకోపశాఖలుగా స్పేటులా అనే సూక్ష్మ భాగాలుగా విడిపోతుంది. ఇవి ఉడుము పట్టుకు కీలకం. ఇవి గోడను అతుకున్నప్పుడు , వాండర్ వాల్స్ ఫోర్సెస్ అనే అణుబంధం కారణంగా ఉడుముకు అంట పట్టు వచ్చిందని సైన్స్ చెబుతొంది.. ఉడుము ఉదరభాగం కూడా గోడను అతుక్కుంటే , గాలి చొరబడనంతగా అతుక్కుంటుంది.. దానివల్లనే ఉడుముని అతుక్కున్నప్పుడు లాగాలంటే కష్టం అంటారు..

