ప్రధానమంత్రి మోడీ పర్యటన దృష్ట్యా ఈ నెల రెండో తేదీన భారీఎత్తున అనేక మార్గాల్లో ట్రాఫిక్ మళ్లిస్తారు. అమరావతిలో శంకుస్తాపనలకోసం రానున్న మోడీ పర్యటన సందర్భంగా , మేనెల రెండో తేదీన చెన్నై, విజయవాడ, విశాఖ , అలాగే విశాఖ నుంచి చెన్నై జాతీయరహదారిపై పోయే భారీ వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేస్తారు. ఆ రోజు రాత్రి 9 గంటల తరువాతే ఈ వాహనాలను వదులుతారు.
చెన్నై నుంచి విజయవాడ మీదుగా విశాఖ వెళ్లే వాహనాలను ఒంగోలు జిల్లా త్రోవగుంట నుంచి చీరాల- బాపట్ల – రేపల్లె – అవనిగడ్డ- పామర్రు గుడివాడ హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం మరియు ఇబ్రహీంపట్నం వైపుకు మళ్ళించడం జరుగుతుంది.అలాగే విశాఖ నుంచి వచ్చే వాహనాలకు కూడా ఇదే రూట్ అమలులో ఉంటుంది.
ఈ విధంగా ఆ రోజున ట్రాన్స్పోర్ట్ వాహనాలు వేటినీ విజయవాడ మీదుగా అనుమతించారు. ప్రతి ఒక్క వాహనం లూప్ లైన్లో పోలీసు నిర్దేశించిన రూట్ లోనే పోవాల్సిఉంది. అలాగే మల్టీ యాక్సిల్ వాహనాలను మాత్రం ఎక్కడికక్కడ నిలిపివేసి రాత్రి 9 గంటల తరువాత వదులుతారు.

