ఏపీలోని కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలోని వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. అయితే ఈ దగ్ధానికి సంబంధించిన కీలక విషయాలు ఫోరెన్సిక్ బస్సు బృందాలు ప్రాథమికంగా గుర్తించబడ్డాయి. లగేజీ క్యాబిన్‌లో తరలిస్తున్న కొన్ని వందల రియల్ మి ఫోన్‌లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారి తీసిందని ఫోరెన్సిక్ బృందం నిర్దారించింది. మొదట బస్సు బైక్ ని ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి, అందులోని పెట్రోల్ కారడం మొదలైందని చెప్పారు. అదే సమయంలో కింది భాగంలో బైక్ ఇరుక్కుపోవడంతో, అది బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లిందని నిప్పురవ్వలు చెలరేగడం, దానికి పెట్రోల్ తోడవడంతో మంటలు ప్రారంభమయ్యాయి.
400 సెల్ ఫోన్ బ్యాటరీలు పేలి ప్రమాదం తీవ్రత పెరిగింది
ఇవి ముందుగా లగేజీ క్యాబిన్‌కు అంటుకున్నాయని, అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్‌లతో కూడిన పార్సిల్ ఉండటంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలిపోయాయని వివరించారు..ఆ మంటలు లగేజీ క్యాబిన్ పైభాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయని వివరించారు. దీంతో లగేజీ క్యాబిన్‌కు సరిగ్గా పైన ఉండే సీట్లలో, బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్న వారు ప్రాణాలు కోల్పోయారని దగ్ధమైన బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి.హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్ అనే వ్యాపారి రూ.46లక్షలు విలువైన రియల్‌మీ కంపెనీ సెల్‌ఫోన్ల బాక్సులను బస్సులో పార్సిల్ చేశారు. ఇవి బెంగళూరులోని ఫ్లిప్‌కార్టుకు చేరాల్సి ఉంది. అక్కడి నుంచి కస్టమర్లకు అవి సరఫరా అవుతాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన హైదరాబాద్ నుంచి ప్రమాద స్థలానికి చేరుకుని, లబోదిబోమన్నారు.
బ్యాటరీలు పేలుడు వస్తువులు లగేజి క్యాబిన్ లో ఉంచడం తప్పే
ప్రమాదంలో మంటల తీవ్రత పెరగడానికి ఈ సెల్‌ఫోన్ల బ్యాటరీలు పేలిపోవడం కూడా ఓ కారణమేనని ఫోరెన్సిక్ నిపుణులు అంటున్నారు. మంటలకు ఆ ఫోన్లు కాలిపోవడంతో బ్యాటరీలు పేలిపోయిన శబ్దం వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు. కర్నూలు బస్సు అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ పి. వెంకటరమణ వివరాలు వెల్లడించారు. బస్సు లగేజ్ విభాగంలో ఉంచిన కొత్త మొబైల్ ఫోన్లు మంటలను మరింతగా పెంచాయని ఆయన చెప్పారు. ఈ హ్యాండ్‌సెట్లు బెంగళూరులోని ఓ కస్టమర్‌కు పంపించడానికి ఉంచి ఉండవచ్చని తెలిపారు. మొబైల్ ఫోన్ల పేలుళ్లు మాత్రమే కాకుండా, బస్సులో ఏసీ వ్యవస్థకు అమర్చిన విద్యుత్ బ్యాటరీలు కూడా పేలిపోయాయని ఆయన వివరించారు. మంటల తీవ్రత వల్ల బస్సు ఫ్లోర్‌పై ఉన్న అల్యూమినియం షీట్లు కరిగిపోయాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

