వైసిపి కీలక నేత, మాజీ సీఎం జగన్ కి అత్యంత ఆప్తుడు, ఆంతరంగికుడు ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ పాలనలో ఐదేళ్ల పాలనలో మద్యం కేసులో జరిగిన కుంభకోణంలో ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేందుకు ఇప్పుడు హైకోర్టు నిరాకరించింది. కేసు దర్యాప్తు కీలక దశలో కొనసాగుతుండటం వల్ల ఇలాంటి కీలకదశలో యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ కోసం పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి తిరుగుతూనే ఉన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇదే బెయిల్ పిటీషన్ కేసులో విచారణ సందర్భంగా హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని అప్పటి వరకు మాత్రమే అరెస్టు నుంచి రక్షణ కల్పించింది.
ఇప్పుడు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో తుది తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వచ్చింది. ఇక నుంచి ఏ క్షణంలో అయినా అరెస్టు నుంచి మిదున్ రెడ్డికి రక్షణ లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో యథేచ్ఛగా జరిగిన లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి ప్రధాన పాత్రధారిగా ఉన్నారన్న ప్రచారం ఉంది. లిక్కర్ స్కామ్ లో అసలు సూత్రధారికి లెక్కలు చెప్పేది, కమీషన్లు చేరవేసేది, సూట్ కేస్ కంపెనీలద్వారా వాటిని రూట్ మళ్లించేది కూడా ఆయనేనని చెబుతారు.
దీంతో ఇప్పుడు అసలు కథ రసకందాయంలో పడింది. వీటన్నింటికి సిట్ విచారణ అధికారులవద్ద వద్ద స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు కోర్టులకు వెళ్లి తప్పించుకునే ప్రయత్నం చేశారు.ఇప్పుడు అన్ని న్యాయపరమైన ప్రయత్నాలు మూసుకుపోయాయి. లిక్కర్ స్కాంలో పాత్రధారులుగా ఉన్న కొంత మంది దుబాయ్ పారిపోయిన విష్యం తెలిసిందే. కొందరిని అరెస్టు చేశారు.వారిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. . ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ప్రస్తుతం. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకూ రక్షణ ఉంది.

