కొన్ని ఆలోచనలు కొత్త విధానాలకు దారి తీస్తాయి. మిర్యాలగూడ ఎం ఎల్ ఏ బత్తుల లక్ష్మారెడ్డి కూడా లాంటి ఆలోచనే చేసి , ఇతర సంపన్న కుటుంబాలకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ పద్దతిని ఎంతమంది అనుసరిస్తారో చూడాల్సిఉంది. ఇటీవల మిర్యాలగూడ ఎం ఎల్ ఏ బత్తుల లక్ష్మారెడ్డి కొడుకు వివాహం జరిగింది. పెళ్లివేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తరువాత తన నియోజకవర్గంలో అనుచరులకోసం భారీ స్థాయిలో వివాహ రిసెప్షన్ ఏర్పాటుచెయ్యాలన్న ఆలోచనలో ఏర్పాట్లు మొదలుపెట్టేశాడు. అయితే ఎందుకో ఆయన ఆలోచన మారింది.
తన నియోజకవర్గంలో రైతులు గుర్తుకొచ్చారు, వెంటనే రిసెప్షన్ ప్రతిపాదన విరమించుకుని , దానికోసం ఖర్చుపెట్టాలనుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్ అందజేసారు. ఈ 2 కోట్లను తన నియోజకవర్గం లోని రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి.చేశారు. లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితం గా అందజేయాలని కోరారు. రిసెప్షన్ ను రద్దు చేసుకొని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేయడానికి ముందుకు వచ్చిన ఎంఎల్ఏ.లక్ష్మారెడ్డి ,కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

