యుద్ధ వీరులంటే మిలిటరీ దుస్తుల్లో తుపాకులు చేతపట్టి శత్రువులను తరిమికొట్టిన వారే.. ఆ పోరులో వీరమరణం పొందిన మహనీయులు.. అయితే పంజాబ్ ల్ని ఫిరోజ్ పూర్ లో ఓ పదేళ్ల బాలుడు కూడా ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ లో యుద్ధవీరుడే.. అందుకే ఆ బాలుడిని ప్రత్యేకంగా మిలిటరీ అధికారి ఘనంగా సన్మానించారు. ఆ బాలుడి ధైర్య సాహసాలను ప్రశంసించాడు. చిన్న వయసులో అతడి ధైర్యానికి , దేశభక్తికి దేశం ముచ్చటపడి అక్కున చేర్చుకునే వీరుడు ఆ బాలుడు.. ఆ బాలుడి పేరు శ్రావణ్ సింగ్.. నాలుగో తరగతి చదువుతున్నాడు.
పాకిస్తాన్ సరిహద్దుల్లో కిలోమీటర్ దూరంలో ఉన్న తారావల్లీ అనే గ్రామంలో ఆ బాలుడు తల్లితండ్రులతో ఉన్నాడు. ఈ గ్రామానికి కూతవేటు దూరంలో లష్కర్ ఇ తోయిబా, జైషే ఇ మహమ్మద్ తీవ్రవాద శిబిరాలు ఉన్నాయి. వాటిని ధ్వంసం చెయ్యాలని సైన్యం అక్కడ ఆయుధాలు, క్షిపణి లాంచర్లు పెట్టింది. శత్రు సంహారంలో , తుపాకుల హోరులో ఉన్న ఆ ప్రాంతంలో సైనికుల కోసం ప్రతిరోజూ ఈ బాలుడు , పాలు, లస్సీ, టీ , బిస్కెట్లు తీసుకెళ్లి పెట్టి వచ్చేవాడు.
ఇదేదో డబ్బులకోసం కాదు.. ఆ బాలుడిలో ఉప్పొంగిన దేశభక్తి చేయించిన సాహసం.. తన తల్లితండ్రులను అడిగి మరీ ఇలా సైన్యానికి ఆహారం తీసుకెళ్లి ఇచ్చేవాడు. ఆ బుడతడి దైర్యం మిలిటరీకి మరింత ఊపునిచ్చిందని, సన్మానం చేసిన సైనిక్ అధికారి అన్నాడు.. నాలుగు రోజుల్లో శత్రు శిబిరాలు, ఉగ్రవాద శిబిరాలను సైన్యం నేలమట్టం చేసేవరకు , ప్రతి రోజు ఈ బాలుడు ఇంటి నుంచి సైనిక స్థావరాలకు పోయి ఆకలి తీర్చి వచ్చేవాడు.. పెద్దయ్యాక సైన్యంలో చేరుతానని గర్వంగా చెబుతున్నాడు..

