22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

పాకిస్తాన్ లో బిచాణా ఎత్తేసిన మైక్రోసాఫ్ట్

పాకిస్తాన్ లో తమ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. సాఫ్ట్వేర్ రంగంలో దిగ్గజం లాంటి మైక్రోసాఫ్ట్ కంపెనీ 25 ఏళ్ల క్రితం పాకిస్థాన్ లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది . వ్యాపారంతో పాటు పాకిస్తాన్లోని కొన్ని వేల స్కూళ్లకు కంప్యూటర్లను సరఫరా చేసి, ఆ దేశంలో విద్యార్థులను కంప్యూటర్ విద్యను విద్యార్థులకు దగ్గర చేయాలని ప్రయత్నాలు చేసింది . అనేక విధాలుగా యువతను ప్రోత్సహిస్తూ అక్కడ సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కారణమైంది. అయితే ఇప్పుడు పాకిస్థాన్లో తమ కార్యకలాపాలు ఆపేస్తున్నట్టు ప్రకటించింది .

అయినప్పటికీ ప్రాంతాలవారీగా ఉన్న డీలర్ తమ రీజనల్ కార్యాలయంలో ఉన్న కొద్ది మంది ద్వారా సేవలు అందిస్తామని చెప్పింది. ఇప్పటివరకు ఉన్నతమ వ్యాపారం లావాదేవీలు విస్తరణ ,సాఫ్ట్వేర్లకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చింది. తమ ఆఫీసును తరలిస్తునామేతప్ప మిగతా కార్యక్రమాలని యధావిధిగా కొనసాగుతుంటాయని కూడా హామీ ఇచ్చింది . అయితే అయితే ఇవన్నీ కూడా బయటనుంచి తాము పర్యవేక్షిస్తుంటామని ఇక్కడ కొద్ది మంది సిబ్బంది ఉంటారని కూడా చెప్పింది. పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ కంపెనీ తన కార్యకలాపాలను అధికారికంగా మూసివేయడంతో ఆ దేశంలో ఆర్థిక పరిస్థితులు, ఆ దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం బట్టబయలైంది.

పాకిస్తాన్లో ఏ ప్రజా ప్రభుత్వం కూడా రెండేళ్లకు మించి పనిచేయలేదు. అక్కడ తీవ్రవాదులు, తీవ్రవాదులు అండదండలు ఉన్న మిలటరీదే అధికారం. పరోక్షంగా వారి పెత్తనమే కొనసాగుతుంది. తాజాగా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితి అదే. అమెరికా అధ్యక్షుడిని నేరుగా పాకిస్తాన్ జనరల్ కలుసుకొని చర్చలు జరిపి వైట్ హౌస్ లో విందు ఆరగించి వచ్చాడంటేనే పాకిస్తాన్ అధ్యక్షుడు కీలుబొమ్మని అర్థమైపోతుంది. తీవ్రవాదులు మరణిస్తే వారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసే ఏకైక దేశం పాకిస్తాన్ . మరోవైపు పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రతరం కావడంతో, తీవ్రవాద కార్యకలాపాలు కూడా అధికారికంగానే జరుగుతుండడంతో ,మైక్రోసాఫ్ట్ ముందుగానే జాగ్రత్తపడి అక్కడ నుంచి బిచాణా ఎత్తేసింది.

దీని ప్రభావం ఇతర విదేశీ సంస్థలపై కూడా పడుతుంది . పాకిస్థాన్లో పెట్టుబడులపై కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది . మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోవడం, దేశంలో నియంతృత్వ పోకడలకు పోతున్న ప్రభుత్వం కారణమని మాజీ అధ్యక్షుడు ఆల్వి విమర్శించారు . ప్రజా ప్రభుత్వాలు ఉంటేనే విదేశీ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టి దేశాన్ని అభివృద్ధి సహకరిస్తాయని ఆయన అన్నారు. ప్రజలు ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని దేశంలో మిలటరీ పరిపాలన పరోక్షంగా జరిగే విధానాన్ని అడ్డుకోవాలని కూడా సూచించారు. 2000 సంవత్సరంలో మైక్రోస్కా సాఫ్ట్ పాకిస్తాన్లో ప్రారంభించింది . కచ్చితంగా 25 ఏళ్ల నాటికి వాటిని మూసేసింది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.