ప్రపంచం ఊహించని సాంకేతిక ప్రగతి వైపు దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి . ఈరోజు విన్నది ,ఈరోజు చూసింది రేపటికి పాతదైపోవచ్చు . అలాంటి సాంకేతిక ప్రగతిలో దూసుకుపోతున్న సమాజంలో ఇంకా కొన్ని దేశాలు వెనుకబడి ఉండడం గమనార్హం.

ఫేస్బుక్ అంటే మెటా కంపెనీ, గూగుల్ సంస్థలు ఇంటర్నెట్ , కేబుల్స్ రంగంలో విప్లవం సృష్టించబోతున్నాయి . ఫేస్బుక్ దాదాపు 57 వేల కిలోమీటర్లు దూరంలో వివిధ ఖండాలను కలుపుతూ సముద్రం అడుగు భాగంలో కేబుల్స్ వేయనుంది . దీనివల్ల వివిధ దేశాల మధ్య ఎంత పరిమాణంలో అయినా డేటా ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. డేటా ట్రాన్స్ఫర్ కూడా క్షణాల్లో జరిగిపోతుంది. ఈ ప్రాజెక్టు విషయమై ఇప్పుడు కార్యాచరణ మొదలైంది.

గూగుల్ అయితే ప్రత్యేకంగా ఆకాశమార్గంలో లోన్ అనే సిస్టం ద్వారా ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్ కి మరో ఆలోచన చేసి దాన్ని దిశగా ఏర్పాట్లు చేస్తోంది. అంటే ఆకాశమార్గంలో సాంకేతిక బెలూన్లను ఉంచడం ద్వారా ఆ బెలూన్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ చేసే విధానం అన్నమాట. దీంతో ఆఫ్రికా దేశాలకు కూడా 4g సేవలను సులభంగా అందించవచ్చు . క్షణాల్లో డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు . ఇలా ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ రంగాన్ని గూగుల్ , మెటా గుప్పెట్లో తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

