22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

హంతక పోలీస్ అధికారిని పట్టిచ్చిన Y U అక్షరాలు

తొమ్మిదేళ్ల తరువాత ఒక పోలీస్ అధికారి చేసిన హత్య బయటపడింది.. శవం బయటపడకపోయినా , y ,u అనే రెండు ఇంగ్లిష్ అక్షరాలు ఆ హంతక పోలీస్ అధికారిని పట్టించాయి. ఎట్టకేలకు అతడికి జీవిత ఖైదు విధిస్తూ నయయమూర్తి తీర్పు చెప్పారు. అశ్విని బిద్రె అనే మహారాష్ట్ర పోలీసు అధికారిణికి, మరో పోలీస్ అధికారి కురుంద్ తో పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. ఇద్దరికీ పెళ్ళై, పిల్లలున్నారు. అయినా విడాకులిచ్చి , ఇద్దరూ పెళ్లిచేసుకోవాలనుకున్నారు. అయితే ఇన్స్పెక్టర్ కురుంద్ ఆమెని పెళ్లి చేసుకునేందుకు వెనుకంజవేసాడు. భర్తని వదిలేసినా తరువాత ఇలా చేయడం ఏమిటని ఇన్స్పెక్టర్ అశ్విని అతడిని వత్తిడి చేసింది.

ఈ నేపథ్యంలో అశ్వనిని అతడు తన ఫ్లాట్ కి పిలిచి చంపేసి, శవాన్ని గోతంలో కట్టి సముద్రం క్రీక్ లో వేసేశాడు. ఆమె ఫోన్ లోనే ఆమె తండ్రి, తల్లికి మెస్సేజ్ పెట్టాడు. తాను యోగసాధనకు యూపీకి పోతున్నాననని , కొంతకాలం రానని ఆ మెసేజ్ సారాంశం.. ఇదంతా జరిగి ఏడేళ్ల తరువాత కూడా ఆమెది మిస్సింగ్ కేసుగానే ఉండిపోయింది. అయితే అశ్వని మొదటి భర్త , ఆమె తండ్రి, సోదరులు ఈ కేసుని వదల్లేదు. పోలీస్ కూడా ప్రతిష్టగా తీసుకొని దర్యాప్తు ముమ్మరం చేసింది.

పోలీస్ స్టేషన్లో కంప్యూటర్లు, ఆమె లాప్ టాప్ లు, ఫోన్ కాల్స్ , సిసి కెమెరా దృశ్యాలు.. గూగుల్ మ్యాప్స్ .. ఇలా అన్ని రకాలుగా సాక్ష్యాలు సేకరించింది. చివరగా ఆమెని చంపేసిన తరువాత ఆమె పేరుతొ ఆమె ఇచ్చినట్టుగా ఇచ్చిన మెసేజ్ లలో you అన్న పదంలో y అని ఉంది.. అయితే చనిపోయిన అశ్విని you అన్న పదాన్ని u అనే అక్షరంతో వాడుతుంది. హంతకుడు కురుంద్ మాత్రం you అన్న పదాన్ని y అనే అక్షరంతో వాడుతారు.. ఈ పొరపాటే అతడిపై అనుమానాన్ని పెంచి , శవం దొరక్కపోయినా అన్ని సాక్ష్యాలతో హంతకుడుగా నిలబెట్టింది..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.