మీరెట్ లో ప్రియుడితో కలిసి ,భర్తను దారుణంగా అంతం చేసిన భార్య మస్కన్ ను పోలీసులకు పట్టించింది ఆమె తల్లిదండ్రులే. తమ అల్లుడు చాలా మంచి వాడని, కూతురు పెడదారి పట్టినప్పటికీ బిడ్డ కోసం భరించాడని, అయితే తమ కూతురుప్రియుడితో కలిసి ఇంత కిరాతకంగా అల్లుడ్ని చంపేస్తుందని ఊహించలేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. అందుకే తాము కూతుర్ని ఆమె ప్రియుడిని పోలీసులకు పట్టించామని చెప్పారు. స్వంత ఇంట్లోనే భార్య , ఆమె ప్రియుడు సాహిల్ , సౌరబ్ ని అంతంచేసిన విధానం దారుణంగా ఉంది . సౌరభ్ ని హత్య చేసిన వీరిద్దరూ అతడి శవాన్ని ఒక డ్రమ్ములో పెట్టి ఒక బస్తా సిమెంట్ డ్రమ్ములో పోసి దాంట్లో నీళ్లు పోసేశారు.
డ్రమ్ములో పెట్టక ముందు మృతదేహాన్ని 15 ముక్కలుగా చేశారు . ఆ తర్వాత ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత 15 రోజులు విహారయాత్రకు డార్జిలింగ్ కి వెళ్లారు. విహారయాత్ర తర్వాత ఇంటికి తిరిగి వచ్చి సిమెంట్ లో కూరుకు పోయిన డ్రమ్ముని బయటకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు . ఇందుకోసం ఇద్దరూ కూలీలను కూడా పిలిపించారు. అయితే నీళ్లలో కలిసిన సిమెంటు గడ్డకట్టి బరువెక్కి పోవడంతో ఆ కూలీలు ఈ డ్రమ్మును కదిలించే ప్రయత్నంలో మూత ఊడి బయటకు వచ్చి దుర్గంధం వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన కూలీలు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు . దీంతో మస్కన్, తల్లితండ్రుల దగ్గరకు వెళ్ళిపోయింది. అక్కడ విషయం తెలుసుకున్న తల్లి ఆమె తల్లిదండ్రులు అక్కడి పోలీసులు సమాచారం ఇచ్చి కూతురిని , ఆమె ప్రియుడిని అరెస్ట్ చేయించారు. సౌరభ్ లండన్ లో మర్చెంట్ నేవీ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు.

