ఓకే గర్భ సంచిలో ఇద్దరు లేదా ముగ్గురు, నలుగురూ ఇలా పిల్లలు ఉండటం తరచుగా జరిగేదే.. ఒకే క్యాంపులో ఏడుమందిని కన్నతల్లులు కూడా ఉన్నారు.. అయితే అప్పుడప్పుడూ వైద్య శాస్త్రంలో కొన్ని నమ్మలేని, అరుదైన సంఘటనలు జరుగుతుంటాయి..అదే సృష్టి విచిత్రం. ఒక మహిళ గర్భం దాల్చిన తరువాత మూడు నెలలకు మళ్ళీ, మరో గర్భం దాల్చింది. నిజంగా ఇది అద్భుతమే. ప్రకృతి ధర్మాన్ని, వైద్య శాస్త్రాన్ని సవాల్ చేసేదే.. మహిళా గర్భం దాల్చిన తరువాత , ఆమెకు అండం విడుదల ఆగిపోతుంది.
రెండు గర్భాలు, రెండు గర్భాల్లో ఇద్దరు బిడ్డలు.
అయితే ఓ మహిళా గర్భం దాల్చిన మరో మూడు నెలలకు మరో అండం విడుదలై ఆమె గర్భం దాల్చింది. అంటే ఆమె మూడు నెలల వ్యవధిలో రెండు సార్లు ప్రసవిస్తుంది. రెండు గర్భాలు, రెండు గర్భాల్లో ఇద్దరు బిడ్డలు. ఇదే వైద్యులకు అర్ధంకాని అద్భుతం. మహిళా గర్భం దాల్చిన తరువాత రుతుక్రమం ఆగిపోతుంది. అంటే అండం విడుదల కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ మహిళ ఒకసారి గర్భం దాల్చిన తరువాత రెండో దఫా , మూడు నెలలకు మళ్ళీ గర్భం ఎలా దాల్చిందో గానీ రెండో గర్భంలో బిడ్డకూడా ఆరోగ్యంగానే ఉంది.
వైద్య పరిభాషలో సూపర్ ఫెటేషన్
దీనిని వైద్య పరిభాషలో సూపర్ ఫెటేషన్ అంటారు. ఇది అత్యంత అరుదైన జీవ వైవిధ్యం . ఇది రెండో అండం విడుదలై మళ్ళీ ఫలదీకరణ చెంది , రెండో గర్భం ఏర్పడేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇది అత్యంత అరుదైన సందర్భాలలోనే సంభవిస్తుంది. మనుషుల్లో అతి అరుదైన ఈ పరిణామం , కుందేళ్లు , కొన్ని రకాల చేపలలో అప్పుడప్పుడు జరిగేదే. ఒక గర్భంతో ఉన్నప్పుడు మూడు నెలలకు మరో గర్భం వచ్చిన మహిళ కేసును పరిశోధన పరంగా బిఎంజె లో ప్రచురించారు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

