దూసుకువస్తున్న మంతా తుఫాన్ భయంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ఈ తుఫాన్ తో ఆంధ్రప్రదేశ్ కి ముప్పు తప్పదన్న హెచ్చరికలు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఏదో ఒకచోట తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్టోబర్ 26,27,28,29, తేదీల్లో చాలా మంతా తుఫాను విరుచుకుపడే కీలకమైన రోజులని వాతావరణ శాఖ హెచ్చరించింది. 28 అర్ధరాత్రి, లేదా 29 తెల్లవారుజామున సమయంలో ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటనున్న మంతా తుఫాను ఈ సంవత్సరం ఇప్పటివరకు వచ్చిన అన్ని తుఫానులలో బలమైన తుఫాన్ అని చెబుతున్నారు.
విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు దీని ప్రభావం
విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు దీని ప్రభావం ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురవచ్చు. తీర ప్రాంతాల్లో ఉన్న మత్యకారులను అప్రమత్తం చేయాలి ఎవ్వరు కూడా సముద్రవేటకి వెళ్ళరాదని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని.కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలిని సూచనలు చేశారు.బలమైన గాలులు గంటకు 70నుంచి 100 కిలోమీటర్లు వేగంతో వీయవచ్చు.
స్కూల్స్, కాలేజీ, 28,29 తేదీల్లో సెలవు
ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న స్కూల్స్, కాలేజీ, 28,29 తేదీల్లో సెలవు ప్రకటించవలసిందిగా వాతావరణ శాఖ అధికారులు సూచన చేశారు. మధ్య కోస్తాఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం, దివిసీమ అన్ని బాగాల్లోనూ , విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మంతా తుఫాను సమయంలో భారీ స్థాయిలో వర్షాలు రాబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

