22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

10 శాతం మెదడుతోనే ఆరోగ్యంగా , ఇదేందయ్యా ?

మానవ శరీర నిర్మాణం వైద్యశాస్త్రానికి కూడా అంతుపట్టదు. మానవ దేహ నిర్మాణం, పనితీరు వైద్యశాస్త్రానికి తెలిసింది 10 శాతం మాత్రమే. మిగతా 90 శాతం వైద్యశాస్త్రానికి అతీతమైనది. అర్థం కానిది. అద్భుతమైన సృష్టి విచిత్రం మానవ దేహం. 44 ఏళ్ళ ఓ వ్యక్తి ఫ్రాన్స్ లో 90 శాతం మెదడు లేకుండానే ఆరోగ్యవంతంగా ఉన్నాడు అంటే మీరు నమ్మగలరా ? నమ్మరు, నమ్మలేరు. కానీ అది కటోర నిజం. ఇదేదో మాయా మంత్రాల కధో , లేకపోతే కట్టుకధలతో, కల్పనలతో తీసే ఇంగ్లీష్ సినిమానో మరేదో కాదు. ఇది వాస్తవం. అతడు వైద్య ప్రపంచాన్ని కాదు శాస్త్ర ప్రపంచాన్ని ఆశ్చర్యం లో ముంచిన వ్యక్తి . ఆ వ్యక్తి బలహీనంగా ఉందంటూ డాక్టర్ దగ్గరికి వచ్చారు. కాళ్లు లాగుతున్నాయని ,కొంచెం బలహీనంగా ఉందని చెప్పాడు. అన్ని పరీక్షలు తర్వాత డాక్టర్లు అతడికి స్కాన్ చేయించుకోమని చెప్పారు. ఆ తర్వాత స్కాన్ రిపోర్ట్ చూసిన తర్వాత డాక్టర్లకు నోట మాట రాలేదు.

అతను తల లో పుర్రె మొత్తం సెరిబ్రోస్పైనల్ ద్రవంతో నిండిపోయింది. మెదడు చుట్టూ ఉన్నకణజాలం పలచగా ఉండి లోపల మొత్తం ద్రవపదార్థమే ఉండిపోయింది. దీన్ని వైద్య పరిభాషలో హైడ్రోసేపాలస్ అంటారు. అంటే పుర్రెలో ద్రవపదార్థమే పూర్తిగా నిండిపోయి ఆ ఒత్తిడి వల్ల క్రమక్రమంగా మెదడు చిన్నది అయిపోతుంది. ఈ వ్యక్తికి మాత్రం దాదాపు 90 శాతం మెదడు మాయం అయిపోయింది. అయినా అతడు సంపూర్ణ ఆరోగ్యం , తెలివితేటలతో తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు . తనకు 90 శాతం మెదడు లేదని డాక్టర్లు చెప్పే అంతవరకు అతనికి తెలియదు . అయితే అతడికి ఎటువంటి సమస్యలు కూడా లేవు. మెదడు వైకల్యం వల్ల వచ్చే మతిమరుపు,పక్షవాతం , నడవ లేకపోవడం, చూపు పోవడం, మాట పోవడం, చేతులు పని చేయకపోవడం ఇలా అన్ని రకాలుగా మెదడుకు సంబంధించిన సమస్యలు ఏమీ లేవు . మనిషి చాలా ఆరోగ్యంగానే ఉన్నాడు.

అతని మేధాశక్తి కూడా కొంచెం తగ్గినట్టు కనపడ్డప్పటికీ బాగానే ఉంది . నార్మల్ రేంజ్ లోనే ఉందని డాక్టర్లు నిర్ధారించారు . ఇది మొత్తం శాస్త్ర ప్రపంచాన్ని ,వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేసింది. అప్పటివరకు వారికి ఉన్న అభిప్రాయాలను సవాల్ చేసేదిగా ఉంది. చివరకు డాక్టర్లు కూడా వందల కోట్లలో ఒకటో రెండో ఇలాంటి కేసులు ఉన్నాయని చెప్పి సర్దుకున్నారు. కానీ దానికి కారణం ఏమిటో, మెదడులేని ఈ వ్యక్తి అంత ఆరోగ్యంగా ఎలా ఉన్నాడో , మెదడుకు సంబంధించిన పనులన్నీ మెదడు లేకపోయినా అతని ఎలా చేయగలుగుతున్నాడో మాత్రం చెప్పలేకపోతున్నారు . ఇది ఒక అద్భుతం అని అద్వితీయమని, ఒక అతీంద్రియ శక్తి అని మాత్రమే చెప్పారు. ఊహకంటే, కల్పన కంటే నమ్మలేనంత నిజం ఇది.. నైతిక విలువలు , వైద్య ప్రమాణాలప్రకారం అతడి ఆనవాలు, పేరు బయటకు చెప్పకూడదు. అందువల్లనే ప్రపంచంలో లాన్సెట్ అనే మెడికల్ బులెటిన్ కూడా అతడిపేరు లేకుండానే ఈ స్టడీ ని ప్రచురించింది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.