తాగిన మైకంలో ఓ వ్యక్తి రన్నింగ్ లో ఉన్న బస్సు కింద భాగంలో అమర్చిన స్టెప్ని టైర్ పై పడుకొని 15 కిలోమీటర్లు ప్రయాణంచేసాడు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు నుంచి హిందూపురం వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ తాగుబోతు సాహస వింత ప్రయాణం ఆశ్చర్యానికి గురిచేసింది. బస్సు వెనుక టైర్ పక్కనే ఉన్న స్పేర్ టైర్ ఎక్కి పడుకున్న మందుబాబు అలాగే ఉండిపోయాడు. దాదాపు 15 కిలోమీటర్లు మందు బాబు బస్సు కింద వేలాడుతూ ప్రయాణం చేసాడు. బస్సు వెనుక వస్తున్న వాహనాల డ్రైవర్ లు బస్సు కింద ఎవరో వేలాడుతున్నట్లు గమనించారు . దీంతో . ఆర్టీసీ బస్ డ్రైవర్ , బస్సు ఆపి వెనుక టైర్ దగ్గర ఏముంది అని చూడగా…మందుబాబు పడుకుని ఉన్నాడు . ఖంగుతిన్న ఆర్టీసీ డ్రైవర్ వెంటనే మందు బాబును బస్సు కింద నుంచి బయటకు తీశారు..

