భార్యతో విడాకులు అయిపోయిన తర్వాత పీడ వదిలిందని ఓ వ్యక్తి నడిరోడ్డులో 40 లీటర్ల పాలతో స్నానం చేసి పునీతుణ్ణి అయ్యానని ఆనందపడ్డాడు. ఏడేళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఆ భార్యతో పడరాని బాధలు పడ్డానని , ఆమెను పెళ్లాడిన పాపానికి పరిహారంగా పాలతో స్నానం చేసి , పాపాలు కడిగేసుకున్నానని చెప్పాడు. అస్సాంలోని నలబరి జిల్లాలో ఈ సంఘటన పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. మాణిక్ అలీ , నఏ వ్యక్తి నల్బరి గ్రామానికి చెందినవాడు.
తన భార్య ఒకరితరువాత ఒకరుగా ఐదు మందిని ప్రేమించి , ప్రేమించిన వాళ్ళతో వెళ్లిపోయిందని అన్నాడు. చివరకు నచ్చజెప్పి తీసుకోచ్చానని చెప్పాడు. అయినా కూడా పక్కదారులు పట్టడం మానలేదని, ఆవేదన వ్యక్తం చేశారు .ఎంతగానో చెప్పిన వినడం లేదని, తీసుకొచ్చిన కొద్దిగా కాలానికి మళ్లీ వెళ్లిపోవడం అలవాటుగా మారిందని అన్నారు. దీంతో విసిగిపోయి విడాకులకు కోర్టుకెళ్లానని చెప్పాడు. కోర్టు కూడా విడాకులు మంజూరు చేసిందని చెప్పారు. అందువల్లనే తను ఆమెను పెళ్లి చేసుకున్న పాపానికి , విడాకులు వచ్చిన తరువాత పాలతో తనను తాను పాలతో అభిషేకంచుకుంటున్నానని అన్నాడు .
ఆమెను మార్చాలని ఎంతగా ప్రయత్నం చేసినా , వీలుకాలేదని , తీసుకొచ్చిన ప్రతిసారి , ఎవరో ఒకరిని ప్రేమించడం వారితో వెళ్లిపోవడం అలవాటుగా మారిందని అన్నారు . తనకు ఐదేళ్ల కూతురు ఉందని కూతురిని తల్లితోనే ఉండేందుకు అంగీకరించానని అన్నాడు . చుట్టుపక్కల మహిళలు కూడా మాట్లాడుతూ ఆమెను మాణిక్ చాలాకాలం ఓపికగా భరించాడని చెప్పారు. ఎప్పటికప్పుడు బుద్ధిగా ఉంటానంటూ , మళ్ళీ ఎవరో ఒకరితో లేచిపోయేదని అన్నారు. ఆమెకు విడాకులిచ్చి మాణిక్ మంచిపని చేసాడని మెచ్చుకున్నారు.

