పడకగదిలో రాత్రి నిద్రపోయేసమయంలో లైట్ ఉంటె మంచిదా..? ఆర్పితే మంచిదా..?? అమెరికన్ కార్డియాలజీ శాస్త్రీయ సదస్సులో తేలిన నిజాలు ఇవి.. పడగదిలో లైట్ ఉంటే కొంతమందికి నిద్ర రాదు,. లైటు ఆర్పేస్తేనే నిద్రపోతారు. మరి కొంతమంది లైట్ ఉంటేనే నిద్రపోతారు. లైట్ ఆర్పితే నిద్రపోరు . అయితే నిద్రపోయే సమయంలో పడగదిలో లైట్ ఉండడం మంచిది కాదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ శాస్త్రీయ సదస్సులో తేల్చింది . ఇందుకు సంబంధించిన పరిశోధన సాక్షాలను కూడా ఆ సదస్సులో ప్రదర్శించింది. నిద్రపోయే సమయంలో లైట్ ఉంటే అది మెదడును ఉత్తేజం చేస్తుందని, మనిషి నిద్రలో ఉన్నా వెలుగుతున్న లైట్ మెదడును ప్రేరేపిస్తుందని తేల్చింది .
అందువల్ల మనకు తెలియకుండానే ఉత్తేజమైన మెదడు కారణంగా గుండె వేగం కూడా పెరుగుతుందని , అది హార్మోన్స్ సమతుల్యతను దారి తప్పిస్తుందని తేల్చారు .ఇదంతా నిద్రపోయే వ్యక్తికి తెలియకుండానే జరిగే ప్రక్రియ . మెదడు ఉత్తేజితమై ,దాని కారణంగా హృదయ స్పందన ఎక్కువై ,దానికి కారణంగా హార్మోన్ సమతుల్యత గాడిదప్పుతోందని ఈ సదస్సులో తేల్చారు. రాత్రి సమయంలో లైట్ వేసుకోవడం వల్ల గుండె సంబంధమైన సమస్యలు వస్తాయని ,బరువు కూడా పెరుగుతారని ,షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మంచిది కాదని తేల్చారు . అయితే ఇవన్నీ మనిషికి తెలియకుండానే అంతర్లీనంగా జరిగే మార్పులని ,ఇవి కాలక్రమంలో మనిషి దేహంపైన ,ఆరోగ్యంపైన ప్రభావితం చూపిస్తాయని తేల్చారు .
రాత్రి నిద్రపోయే సమయంలో లైట్ ఉంటే నాడీ సంబంధమైన సమస్యలు నిశ్శబ్దంగా తలెత్తి ఇది రక్తంలోని చక్కెర స్థాయిలో జోక్యం చేసుకుంటుంది . అందువల్ల షుగర్ కంట్రోల్ కూడా కాదు. ఈ కారణంగానే పడకగదిలో నిద్రపోయే సమయంలో లైట్ ఆర్పడం మంచిదని కర్టెన్లు కూడా వెలుతురు రాని విధంగా వాడుకోవాలని చెప్పారు . రాత్రి సమయాల్లో లైట్ లు ఆపి పడుకునే వారిలో గుండె జబ్బు రోగుల్లో కూడా దాని ప్రభావం బాగా కనపడిందని వారిలో గ్లూకోస్ స్థాయి, గుండె కొట్టుకునే వేగం ఇవన్నీ కూడా లైట్ ఆర్పి పడుకున్నప్పుడు సక్రమంగానే ఉంటాయని ఆ సదస్సులో నిర్ధారించారు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

